భాగ్య శ్రీ రీ ఎంట్రీ

Published On: March 14, 2018   |   Posted By:

భాగ్య శ్రీ రీ ఎంట్రీ

మైనే ప్యార్ కియా సినిమా ఎంత‌టి సెన్సేష‌న‌ల్ హిట్ అయ్యిందో అంద‌రికీ తెలిసిందే. స‌ల్మాన్‌ఖాన్‌, భాగ్య శ్రీ ఇందులో జంట‌గా న‌టించారు. ఈ సినిమాను తెలుగులో ప్రేమ పావురాలు పేరుతో డ‌బ్ చేస్తే.. తెలుగులో కూడా సూప‌ర్‌డూప‌ర్ హిట్ అయ్యింది. ముఖ్యంగా ఆ సినిమా పాట‌లు ఇప్ప‌టికీ మ‌నకు ఇంపుగానే విన‌ప‌డుతుంటాయి. ఈ సినిమా త‌ర్వాత భాగ్య శ్రీ పెళ్లి చేసుకుని సెటిలైంది. త‌ర్వాత తెలుగులో ఒక‌ట్రెండు చిత్రాల్లో న‌టించిన పెద్ద‌గా అవ‌కాశాలు రాలేదు. చాలా గ్యాప్ త‌ర్వాత భాగ్య‌శ్రీ తెలుగులో న‌టించ‌నున్నారు.

బాలీవుడ్‌లో విజ‌య‌వంత‌మైన `2 స్టేట్స్‌` చిత్రాన్ని తెలుగులో అడ‌విశేష్‌, శివాని(జీవితా రాజ‌శేఖ‌ర్ కుమార్తె)ల‌తో ఈమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ రీమేక్‌లో శివాని త‌ల్లి పాత్ర‌లో భాగ్య శ్రీ న‌టించ‌బోతున్నార‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. వెంక‌ట్ రెడ్డి ఈ రీమేక్‌ను తెర‌కెక్కిస్తున్నారు.