భారతదేశంలో అత్యధిక పారితోషికం వీళ్లకే

Published On: September 4, 2017   |   Posted By:

భారతదేశంలో అత్యధిక పారితోషికం వీళ్లకే

భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకోవాలంటే అది బాలీవుడ్ కే చెల్లుతుంది. మిగతా సినీపరిశ్రమలేవీ ఆ స్థాయికి ఎదగలేదు. అలా ఈ ఏడాది కూడా అత్యధిక పారితోషికం తీసుకున్న నటీనటులుగా బాలీవుడ్ తారలే నిలిచారు. పోటీ కూడా వాళ్ల మధ్యే కొనసాగింది. అయితే ఈసారి కాస్త ఆశ్చర్యకరమైన ఫలితాలు వెలువడ్డాయి. బాక్సాఫీస్ కింగ్ గా పేరుతెచ్చుకున్న సల్మాన్ ఖాన్ ను షారూక్ ఖాన్ క్రాస్ చేస్తే… రణబీర్ కపూర్, రణ్వీర్ సింగ్ లాంటి స్టార్స్ ను దీపికా పదుకోన్ వెనక్కు నెట్టింది. గతేడాది జూన్ 1 నుంచి ఈ ఏడాది జూన్ 1 మధ్య కాలానికి సంబంధించి హీరోహీరోయిన్లు ఆదాయాల్ని ఫోర్బ్స్ ప్రకటించింది. ఆ జాబితా మీకోసం..

1.     షారూక్ – రూ. 243 కోట్లు

2.    సల్మాన్ – రూ. 236 కోట్లు

3.    అక్షయ్ – రూ. 224 కోట్లు

4.    అమీర్ – రూ. 80 కోట్లు

5.    హృతిక్ – రూ. 73.6 కోట్లు

6.    దీపికా పదుకోన్ – రూ. 70 కోట్లు

7.    రణ్వీర్ సింగ్ – రూ. 64 కోట్లు

8.    ప్రియాంక చోప్రా – రూ. 63 కోట్లు

9.    అమితాబ్ – రూ. 57 కోట్లు

10.  రణబీర్ కపూర్ – రూ. 54 కోట్లు