భారీ రేటుకు గరుడవేగ శాటిలైట్ రైట్స్

Published On: November 21, 2017   |   Posted By:
భారీ రేటుకు గరుడవేగ శాటిలైట్ రైట్స్
మొన్నటివరకు జీ తెలుగు, జెమినీ ఛానెల్ మధ్య దోబూచులాడింది గరుడవేగ సినిమా. ఈ మూవీ శాటిలైట్ రైట్స్ దక్కించుకునేందుకు ఈ రెండు ఛానెల్స్ చాలా ప్రయత్నించాయి. ఎట్టకేలకు గరుడవేగ శాటిలైట్ రైట్స్ ను జెమినీ టీవీ దక్కించుకుంది. తాజా సమాచారం ప్రకారం.. ఈ మూవీ రైట్స్ 4 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయి. జీ తెలుగు ఛానెల్ ఆఖరి నిమిషం వరకు చర్చలు సాగించినప్పటికీ ఈ రేటుకు కొనలేకపోయింది.
నిజానికి గరుడవేగ సినిమా శాటిలైట్ కు 5 కోట్లు ఆశించారు మేకర్స్. కానీ అంత మొత్తం ఇవ్వడానికి రెండు ఛానెల్స్ అంగీకరించలేదు. 4 కోట్ల నుంచి నాలుగున్నర కోట్ల మధ్య చర్చలు సాగాయి. చివరికి 4 కోట్ల రూపాయలకే డీల్ సెట్ అయింది. ఓవైపు శాటిలైట్ డీల్ తో పాటు మరోవైపు ఈ 17 రోజుల్లో గరుడవేగ సినిమా థియేట్రికల్ వసూళ్లలో 30 కోట్ల రూపాయల మార్క్ అందుకుంది.  అటు హిందీ డబ్బింగ్ రైట్స్ తో కలుపుకుంటే ఈ సినిమా ప్రాఫిట్ జోన్ లోకి ఎంటరైనట్టే.