భీష్మ మూవీ రివ్యూ

Published On: February 21, 2020   |   Posted By:

భీష్మ మూవీ రివ్యూ

ఫన్ ప్రభుద్దుడు (నితిన్ ‘భీష్మ’ రివ్యూ)
 
Rating: 3/5
 
ఫన్ ఎప్పుడూ పేయింగ్ ఎలిమెంటే. అయితే ఫన్ పండించటం మాత్రం సర్కస్ ఫీటే. ఏ మాత్రం బ్యాలెన్స్ తప్పినా వేగంగా క్రిందకి జారిగిపోతుంది. పట్టుకుందామన్నా పట్టు దొరకదు. అందుకే అందరూ ఫన్ చేయలేరు. ఫన్ తో ప్రాసలతో గేమ్ లు ఆడాలనుకోరు. అయితే ఫన్ ని ఆయువు పట్టుగా పట్టుకుని త్రివిక్రమ్ తన కెరీర్ ని సక్సెస్ ఫుల్ గా మలుచుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఆయన శిష్యుడు కూడా అదే దారిలో ప్రయాణం పెట్టుకున్నాడు. తొలి సినిమాతోనే ఇది త్రివిక్రమ్ రచనా ఛాయిలు గల చిత్రం అనిపించుకున్నాడు. ఇప్పుడు  ‘భీష్మ’తో దాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళాడా..లేక తనదైన కొత్త దారి వేసుకున్నాడా…అసలు ఈ చిత్రం కథేంటి,నితిన్ కి కలిసి వస్తుందా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

స్టోరీ లైన్
 
మొదటి నుంచీ భీష్మ (నితిన్‌) కొంచెం బిల్డప్ కుర్రాడు.  డిగ్రీ కూడా పూర్తి చేయని భీష్ణ..సోషల్ మీడియాలో మీమ్స్ క్రియేట్స్ చేస్తూ టైమ్ ని కిల్ చేస్తూంటాడు. ఈ క్రమంలో చైత్ర(రష్మిక)ను చూడటం, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనటం జరిగిపోతుంది. అయితే ఆమె ఏసీపీ దేవా(సంపత్‌)  కూతురు.  తన కూతురుని.. భీష్మ ప్రేమిస్తున్నానంటూ వెంటబడుతున్నాడని తెలుసుకొని  కాల్చి పారేస్తానంటాడు.  భీష్మ నాన్న ఆనంద్‌ (నరేశ్‌) అప్పటికప్పుడు ఆ సమస్య నుంచి తప్పించుకోవటానికి  ఓ అబద్దం అల్లి చెప్తాడు.

 తన కొడుకు మామూలోడు కాదని, ఎనిమిది వేల కోట్ల రూపాయలకు పైగా టర్నోవర్‌ కలిగిన భీష్మ ఆర్గానిక్‌ ఫుడ్‌ కంపెనీకి భీష్మ సీఈఓ అని అంటాడు. అలా ఆడిన అబద్దం కొద్ది రోజులుకి భీష్మ ఆర్గానిక్‌ ఫుడ్‌ కంపెనీ ఛైర్మన్ భీష్మ (అనంత్‌ నాగ్‌) అండతో నిజం అవుతుంది. అదెలా జరుగుతుంది. అబద్దం నిజం అవటం వెనక ఏం జరిగింది.  చైత్ర,భీష్మ ల లవ్ స్టోరీ ఎలా ఓ కొలిక్కి వచ్చింది. అలాగే భీష్మ ఆర్గానిక్‌ కంపెనీని నాశనం చేయటానికి ప్రయత్నిస్తున్న  రాఘవన్‌ (జిషుసేన్‌ గుప్తా)ఎవరు వంటి విషయాలు తెలియాలంటి సినిమా చూడాల్సిందే.

స్క్రీన్ ప్లే మ్యాటర్

ఈ సినిమా చిన్న రొటీన్ స్టోరీ లైన్ చుట్టూ…అల్లిన ఎంటర్టైనర్. అలాగే లాజిక్కులు వెతికితే ఈ సినిమా నిలబడదు అని దర్శకుడుకు తెలుసు. అందుకే ప్రతీ సీన్ ని ఫన్ గా మొదలెట్టి ముగించటానికి ప్రయత్నించాడు. అది దాదాపు చాలా భాగం సక్సెస్ అయ్యిందనే చెప్పాలి. అయితే ఓ పెద్ద కంపెనీ..సీఈవో పోస్ట్ లో ఓ మామూలు కుర్రాడుని పెట్టడానికి సరబడ లాజిక్ మాత్రం కనపడదు. ఆ సీన్స్ అన్నీ సినిమాటెక్ గా సరిపెట్టుకోవాల్సిందే. అయితే ఇందులో మ్యాజిక్ ఏమిటీ అంటే డైలాగులు, సిట్యువేషన్స్ అన్ని కొత్తగా ఉండటం. ఫస్టాఫ్ డీసెంట్ గానూ, సెకండాఫ్ మోర్ ఫన్ గానూ ఉంది. సెకండాఫ్ లో దాదాపు ఓ నలభై నిముషాల పాటు ఫన్ పరుగెట్టడం బాగా ప్లస్ అయ్యింది.
 
  హైలెట్స్
క్లీన్ కామెడీ
డైలాగులు,సీన్స్ అన్నీ కామెడీగా సాగటం
నితిన్, రష్మిక కాంబినేషన్,కెమిస్ట్రీ
విలన్ పాత్రధారి నటన

నెగిటివ్ లు
గుర్తుంచుకోదగ్గ కథ కాకపోవటం
ఎమోషన్స్ పెద్దగా పండలేదు
 
టెక్నికల్ గా చూస్తే…
ఇలాంటి రొమాంటిక్ కామెడీలకు కావాల్సిన ఫన్ అయితే అందింది కానీ, పాటలు మాత్రం ఆ స్దాయిలో లేవు. ప్రొడక్షన్ వ్యాల్యూస్ మాత్రం బాగున్నాయి. ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ బ్యానర్ వ్యాల్యూకు తగ్గట్లు మెరిసాయి. ఫైనల్ గా ఇది స్క్రిప్టు బేసెడ్ సినిమా. దర్శకత్వంలో పెద్దగా మెరుపులు లేవు కానీ మరకలు కూడా కనపడవు.
 
చూడచ్చా
చక్కటి క్లీన్ కామెడీ చూడాలనుకునేవారికి ఈ వీకెండ్ మంచి ఆప్షన్
 

నటీనటులు: నితిన్, రష్మిక మందన్న, అనంత్ నాగ్, సంపత్ రాజ్ తదితరులు

సంగీతం: మహతి సాగర్
నిర్మాత: సూర్యదేవర నాగ వంశీ
దర్శకుడు: వెంకీ కుడుముల
విడుదల తేదీ: ఫిబ్రవరి 21, 2020