భూమిక ఎంట్రీని నిర్థారించిన దిల్ రాజు

Published On: August 21, 2017   |   Posted By:

భూమిక ఎంట్రీని నిర్థారించిన దిల్ రాజు

ప్రస్తుతం దిల్ రాజు బ్యానర్ లో ఓ సినిమా చేస్తున్నాడు హీరో నాని. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఎంసీఏ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో సాయిపల్లవి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం భూమికను ఎంపిక చేశారనే వార్తలు వచ్చాయి. వీటిపై ఎట్టకేలకు స్పందించిన సినిమా యూనిట్.. తమ సినిమాలో భూమిక ఉందని పక్కా చేశారు.

పెళ్లి తర్వాత కూడాా సినిమాలు కొనసాగించింది భూమిక. మంచి పాత్రలు దొరికితే చేస్తూ వస్తోంది. అయితే గ్లామర్ రోల్స్ మాత్రం ఆమెకు దక్కడం లేదు. ఎంసీఏ సినిమాలో కూడా భూమిక కు ఓ మంచి క్యారెక్టర్ లభించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి ఆమె పాత్రను సస్పెన్స్ లో ఉంచారు.

ప్రస్తుతం నిన్నుకోరి సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు నాని. ఆ మూవీ మేనియా తగ్గిన కొన్ని రోజులకే ఎంసీఏ ను కూడా థియేటర్లలోకి తీసుకురావాలనుకుంటున్నాడు. డిసెంబర్ 21న ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు.