భ‌ర‌త్ అనే నేను టీమ్‌కి మ‌హేశ్ గిఫ్ట్స్‌

Published On: April 10, 2018   |   Posted By:

భ‌ర‌త్ అనే నేను టీమ్‌కి మ‌హేశ్ గిఫ్ట్స్‌

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ త‌న సినిమా `భ‌ర‌త్ అనే నేను`తో ఏప్రిల్ 20న సంద‌డి చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. `శ్రీమంతుడు` వంటి స‌క్సెస్‌ఫుల్ మూవీ త‌ర్వాత వీరి కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న మ‌రో చిత్ర‌మిది. సినిమాపై యూనిట్ చాలా కాన్ఫిడెంట్‌గా ఉంది. సినిమా అవుట్‌పుట్ బాగా రావ‌డంలో స‌హాయ స‌హ‌కారాలు అందించిన డైరెక్ష‌న్ టీమ్‌కు మ‌హేశ్ ఖ‌రీదైన ఐఫోన్ ఎక్స్ ఫోన్స్‌ను బ‌హుమ‌తిగా అందించాడు. మ‌హేశ్ ట్రీట్‌మెంట్‌తో డైరెక్ష‌న్ టీం అంతా చాలా హ్యాపీగా ఉంద‌ట‌. `శ్రీమంతుడు` సినిమా ఘ‌న విజ‌యం సాధించిన‌ప్పుడు కూడా మ‌హేశ్ ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ‌కు ఖ‌రీదైన కారును బ‌హుమ‌తిగా ఇచ్చారు.