మంచు కురిసె వేళలో ఫస్ట్ లుక్ విడుదల

Published On: November 3, 2018   |   Posted By:

మంచు కురిసె వేళలో ఫస్ట్ లుక్ విడుదల

రామ్ కార్తీక్, ప్రనాలి జంటగా బాల బోడెపూడి స్వీయ దర్శకత్వంలొ ప్రణతి ప్రొడక్షన్ పతాకంపై తెరకెక్కుతొన్న చిత్రం “మంచు కురిసె వేళలో”.దేవా కట్టా వద్ద ప్రస్థానం చిత్రానికి దర్శకత్వ శాఖలొ వర్క్ చెసిన బాల తొలిసారి దర్శక నిర్మాతగా మారి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సినిమా చిత్రీకరణ , నిర్మాణాంతర కార్యక్రమాలను  కంప్లీట్ అయ్యాయి.  కాగా  ఈ రోజు చిత్ర ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా ‌దర్శక నిర్మాత బాల మాట్లాడుతూ..  మంచు కురిసే వేళలొ అందమైన లొకెషన్స్ లొ అంతే అందమైన కథ కథనాలతొ తీసిన స్వచ్చమైన ప్రేమకథ.
సంగీతం, సినిమాటోగ్రఫీ ‌ఎసెట్ గా నిలుస్తాయి. రామ్ కార్తీక్ కెరీర్‌లో ఇదొక ఉత్తమ చిత్రం మవుతుంది.చిత్రీకరణ పూర్తయింది. నిర్మాణాంతర కార్యక్రమాలను కంప్లీట్ చేశాము. ఈ నెలలొనె ఆడియోను, డిసెంబర్ లొ సినిమాను విడుదల చెస్తామన్నారు.
ఈ చిత్రానికి సంగీతం: శ్రావణ్ భరద్వాజ్, కెమెరా: తిరుజ్ఞాన, ప్రవీణ్ కుమార్ పంగులూరి, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు, కధ- స్క్రీన్ ప్లే- నిర్మాత- దర్శకత్వం: బాల బోడెపూడి