మగువలు మాత్రమే మూవీ రివ్యూ

Published On: September 11, 2020   |   Posted By:
మగువలు మాత్రమే మూవీ రివ్యూ
 

మగవాళ్లూ చూడచ్చు: ‘మగువలు మాత్రమే’ రివ్యూ
 
Rating:2.5/5

2017 లో రిలీజైన ఓ తమిళ సినిమా..అదీ ఆడవాళ్లు ప్రధాన పాత్రలో చేసిన చిత్రం, మూడేళ్లకు తెలుగులో డబ్బింగ్ అయ్యి రిలీజ్ అయ్యితే చూడగలమా…అంటే కంటెంట్ బాగుంటే ఎప్పుడైనా నడుస్తుంది అని చెప్చచ్చు. ఈ సినిమాకు జ్యోతికకు ఫిల్మ్ ఫేర్ బెస్ట్ యాక్ట్రస్ గా నామినేట్ కూడా అయ్యింది. రిలీజ్ అయ్యినప్పుడు సినిమా బాగుందని రివ్యూలు, టాక్ వచ్చింది. అయితే సినిమాలో జ్యోతిక తప్ప చెప్పుకోదగ్గ కమర్షియల్ వాల్యూ ఉన్నవాళ్లు లేకపోవటంతో డబ్బింగ్ చేయలేదు. ఓటీటిల పుణ్యమా ఇన్నాళ్లకు దాన్ని ఆహా వాళ్లు తెలుగులోకి తెచ్చి రిలీజ్ చేసారు. ఈ నేపధ్యంలో ఈ సినిమాలో అసలు విషయం ఏమిటి, టైమ్ కుదవపెట్టి ఈ సినిమాని కుదురుగా కూర్చుని మరీ చూడగలమా వంటి విషయాలు రివ్యూలో పరిశీలిద్దాం.
 
స్టోరీ లైన్

ప్రభావతి (జ్యోతిక) చాలా సరదాగా,లైఫ్ లో ప్రతీ క్షణాన్ని  ఎంజాయ్ చేయాలనుకునే ఓ మంచి అమ్మాయి. ఇండిపెండెంట్ గా ఉండే ఆమె..ఆడవాళ్లపై, వాళ్లు కుటుంబాలతో పడుతున్న కష్టాలపై డాక్యుమెంటరీలు చేస్తూంటుంది. ఆమె తన కాబోయే అత్తగారు గోమాత (ఊర్వశి)తో చాలా ప్రెండ్లీగా ఉంటుంది. ఆ క్రమంలో గోమాత తన స్కూల్ ప్రెండ్స్ అయిన సుబ్బలక్ష్మి(శరణ్య) , రాణి అమృతకుమారి(భానుప్రియ) లను చాలా మిస్ అవుతోందని అర్దం చేసుకుంటుంది. దాంతో జీవితంలో సెటిల్ అయ్యి…పిల్లలు, మనవలతో ఉంటున్న వాళ్ల ముగ్గురుని కలపటానికి ప్లాన్ చేస్తుంది. దాదాపు ముప్పై ఏళ్ల తర్వాత విడిపోయిన వారిని, ఫేస్ బుక్ లో ఎడ్రస్ లు అయితే పట్టుకోగలుగుతుంది కానీ, వాళ్ళకున్న వ్యక్తిగత సమస్యలతో ఒక్క గంట కూడా ఖాలీలేనంత బిజీగా గడుపుతున్నారని తెలుసుకుంటుంది. అయితే సరే ప్రభావతి తన పట్టుదల వదలదు. వారు ముగ్గురుని ఓ మూడు రోజులు పాటు తమ సంసారాలకి దూరంగా ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లాలని తాపత్రయపడుతుంది. అందుకు ఆమె ఏం చేసింది. పర్యవశనాలు ఏమిటి…వాళ్లు కలిసారా..కలిసి ఏం చేసారు, ఈ జర్నీలో వారి వ్యక్తిగత జీవితాల్లో ఏం మార్పులు వచ్చాయి.. అనేది మిగతా కథ.

స్క్రీన్ ప్లే ముచ్చట్లు

ఈ సినిమాలో ప్రధాన పాత్ర జ్యోతికది. కానీ ఆమె కథని నడిపే ఓ థ్రెడ్ లాగ ఉంటుందే కానీ ఎక్కడా కథలో ఇన్వాల్వ్ కాదు. అసలు ఈ కథ ఆమెది కాదు..ఆ ముగ్గురిదే. అలాగే జ్యోతిక పాత్రకు ఏ విధమైన సమస్యలు డైరక్టర్ పెట్టుకోలేదు. చివరికైనా జ్యోతికకు ఏదైనా సమస్య వచ్చి…వీళ్ల ముగ్గరు తమ అనుభవంతో తీరిస్తే..అంతసేపు జ్యోతిక పాత్రను మనం చూసినందుకు తృప్తి దక్కేది. అలా చేయకుండా ఆమె పాత్రను లైట్ తీసుకోవటంతో సినిమాలో రావాల్సిన ఇంపాక్ట్ రాలేదు. ఆమెను ఫాలో అవుతూ వెళ్ళే మనకు అలా ప్లాట్ గా వెళ్లినట్లు అనిపిస్తుంది. ఎక్కడా కాంప్లిక్ట్ ఈ కథలో ఆమె వైపు నుంచి కనపడదు.  

ఈ సినిమా స్క్రీన్ ప్లే గొప్పగా లేదు కానీ ఎక్కడా బోర్ కొట్టకుండా రాసిన స్క్రిప్టుకే మనం జై కొడతాం. ముఖ్యంగా సినిమా చూసాక ఓ విధమైన మంచి ఫీల్ తో మన మనస్సు నిండిపోతుంది. డైరక్టర్ ఎక్కువగా కమర్షియల్ ఎలిమెంట్స్ కు ప్రాధాన్యత ఇవ్వకుండా తను అనుకున్న విషయానికే కట్టుబడిన కన్విక్షన్ మనకు నచ్చుతుంది. నిజానికి ఈ సినిమా కాస్తంత ఫెమినిజం భావాలతో తీసినా..అది మనకు డైరక్ట్ గా పాఠం చెప్పినట్లో, లేక మెసేజ్ ఇస్తున్నట్లో చెప్పకపోవటం కలిసి వస్తుంది.

ఈ రోడ్ ట్రిప్ ఫిల్మ్ ఫస్టాఫ్ సరదాగా గడిచిపోయినా సెకండాఫ్ మాత్రం ఆశించిన రీతిలో ఉండదు. ముక్యంగా క్లైమాక్స్ కు కథ వెళ్లే కొలిదీ మెలోడ్రామా ఎక్కువైపోయి..ఏదో 90 ల నాటి సినిమా చూస్తున్నట్లు అనిపిస్తుంది. వాస్తవానికి సెకండాఫ్ మరింత ఫన్ ఉంటే ఇంకా బాగుండేది.

ఎవరెలా..టెక్నికల్ యాస్పెక్ట్..

ఈ సినిమాకు ప్లస్ పాయింట్ నటీనటులు. భానుప్రియ, ఊర్వశి, శరణ్య లు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేసారు. జ్యోతిక పాత్ర పెద్ద చేయటానికి ఏమీ లేదు. కానీ ఆమే ఈ సినిమా లీడ్ ఆర్టిస్ట్. ఇక గెస్ట్ రోల్ లో కనిపించే మాధవన్ …ఇప్పుడు మనకైతే పెద్దగా కిక్ ఇవ్వడు కానీ రిలీజైనప్పుడు ఆయనకు ఉన్న క్రేజ్ కలిసొచ్చి ఉంటుంది. టెక్నికల్ గా ఈ సినిమా డబ్బింగ్ ఫీల్ రాకుండా డైలాగులు బాగా రాసారు. కెమెరా వర్క్ నీటుగా ఉంది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి. దర్శకుడు విజువల్ గా కన్నా డైలాగ్స్ మీదే ఎక్కువ ఆధారపడటమే ఇబ్బందిగా అనిపిస్తుంది. ఎడిటింగ్ సెకండాఫ్ మరింతగా ట్రిమ్ చేయచ్చు. గిబ్రాన్ సంగీతంలో చేసిన పాటలు, రీరికార్డింగ్ బాగున్నాయి.

చూడచ్చా..

ఖచ్చితంగా చూడచ్చు. అయితే జ్యోతిక ని దృష్టిలో పెట్టుకుని యాప్ ఓపెన్ చేస్తే మాత్రం దెబ్బ తింటారు.

తెర ముందు..వెనక
 
ప్రొడక్షన్: కంపెనీ 2డి ఎంటర్టైన్మెంట్
నటీనటులు:  జ్యోతిక, ఊర్వశి, భానుప్రియ, శరణ్య పొన్నన్‌, మాధవన్  తదితరులు
సంగీతం : గిబ్రాన్
సినిమాటోగ్రఫీ:  ఎస్ మణికందన్
ఎడిటర్:  సి ఎస్ ప్రేమ్
రన్నింగ్ టైమ్: 140 నిముషాలు
రచన,దర్శకత్వం:   బ్రమ్మ
నిర్మాత:  సూర్య
విడుదల తేదీ:  11,సెప్టెంబర్ 2020
ఓటీటీ : ఆహా