మనసా పలకవే షార్ట్ ఫిల్మ్ రివ్యూ

Published On: January 30, 2020   |   Posted By:

మనసా పలకవే షార్ట్ ఫిల్మ్ రివ్యూ

ఎక్కువ పలికింది: ‘మనసా పలకవే’ షార్ట్ ఫిల్మ్ రివ్యూ

కొత్త కథలు ఎక్కడా పుట్టవు..ఉన్న విషయాన్నే కొత్తగా ప్రెజెంట్ చేయటమే కావాల్సింది. అది ఈ తరం ఫిల్మ్ మేకర్స్ కు బాగానే అర్దమవుతోంది. చిన్న విషయాన్ని క్లుప్తంగా,అందంగా షార్ట్ ఫిల్మ్స్ గా ప్రెజెంట్ చేస్తూ తమ ప్రతిభను చాటుకుంటున్నారు. ఈ షార్ట్ ఫిల్మ్ కూడా అలాంటిదే.

ప్రేమ అనే రెండు అక్షరాల చుట్టూ ఎన్నో కథలు సినిమాలు, నవలలు, కావ్యాలు,పాటలు, పద్యాలు, వెబ్ సీరిస్ లు,షార్ట్ ఫిల్మ్ లు ఇలా అది ఇదీ అని లేకుండా అల్లబడ్డాయి. ఈ ప్రయత్నం కూడా ప్రేమ చుట్టు తిరిగినా ప్రామిసింగ్ గా ఉంది. హీరో పాత్ర కాస్త అన్ నాచురల్ గా బిహేవ్ చేసినా, హీరో ప్రెండ్ క్యారక్టరే కాస్త ఎక్కువ మాట్లాడినట్లు అనిపించినా మేకింగ్ క్వాలిటీతో దాన్ని దాటేసారు.

నిజానికి ఈ చిన్న షార్ట్ ఫిల్మ్ లో ఆ ప్రెండ్ పాత్ర లేకపోయినా ఏమీ కాదు.అలాగే  ప్రపంచం లో కొన్ని ప్రేమలు ఫైనల్ ఎక్జామస్ దగ్గర అగిపోతాయ్. మరికోన్ని టీనిజ్ లో పోయినా పర్వాలేదు. కాని వయసులు పుట్టిన  ప్రేమ సాధించుకోలేకపోతే తెలియని….అంటూ త్రివిక్రమ్ ని గుర్తు చేస్తూ  చెప్పిన లెంగ్త్ డైలాగు కూడా అవసరం లేదనిపించింది.

ఎక్కడ మొదలెట్టాలో తెలియటం కాకుండా ఎక్కడ ఆపాలో తెలియుటే  నేటి ఫిల్మ్ మేకర్స్ తెలుసుకోవాల్సింది.  ఇది ఈ షార్ట్ ఫిల్మ్ ని ఫెరఫెక్ట్ ప్లేస్ లో ఆపటంలోనే అర్దమవుతోంది.అది ఈ డైరక్టర్ కనక వెంకటేష్ కు బాగానే వంటబట్టింది.  దర్శకుడు తనని తాను ట్రిమ్ చేసుకోగలిగితే మంచి భవిష్యత్ ఉంది. నటీనటులంతా  బాగా చేసారు.

ఈ ఫిల్మ్ కు పనిచేసిన టెక్నీషియన్స్ అందరూ తమ ప్రతిభను సమతూకంలో చూపించారు. వరుణ్ సందేశన్ ని గుర్తు చేస్తున్న  హీరో …నటన,డైలాగు డెలవరీలో రాణించాడు. హీరోయిన్ పాత్ర చేసిన భవాని చౌదరి ..కనపడింది కొద్ది సేపే అయినా..గుర్తుండిపోయే ఫెరఫార్మెన్స్ చేసింది.ముఖ్యంగా షార్ట్ ఫిల్మ్ చివరలో ఆమె..ఎక్సప్రెషన్స్ …ఎక్సప్రెసివ్ గా ఉన్నాయి. టీమ్ లీడర్ గా పూర్ణ సునీల్ లో మంచి నటుడు ఉన్నాడు. సాన పెడితే రాణిస్తాడు.  అలాగే నిర్మాత ప్రశాంత్ యర్రమిల్లి పాటించిన ప్రొడక్షన్ వ్యాల్యూస్ సినిమా స్దాయిలో ఉన్నాయి. 

సమర్పణ: రావ్ -శాన్ ఫిల్మ్స్ ప్రెవేట్ లిమిటెడ్
నటీనటులు: భవాని చౌదరి,పూర్ణ సునీల్, ప్రసన్న కుమార్, నాగరాజు
డిఐ: కిషోర్
ఎడిటర్: సురేష్ దుర్గం
సినిమాటోగ్రాఫర్: అనూష్ కుమార్.పి
సంగీతం: యతీష్
నిర్మాత: యర్రమిల్లి ప్రశాంత్
రచన-దర్శకత్వం: కనక వెంకటేష్.బి