మరణం రెండో టీజర్ విడుదల

Published On: March 1, 2021   |   Posted By:
మరణం రెండో టీజర్ విడుదల
 
 
మరణం రెండో టీజర్ ను విడుదల చేసిన జె డి చక్రవర్తి 
 
శ్రీమతి బి.రేణుక సమర్పణలో ఓషియన్ ఫిలిం ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై వీర్ సాగర్, శ్రీ రాపాక ప్రధాన పాత్రలో.  వీర్ సాగర్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న హారర్ చిత్రం “మరణం”. కర్మ పేస్ (Karma Pays) ఉప శీర్షిక. ఈ చిత్రం లోని మొదటి టీజర్ ను సి కళ్యాణ్ గారు విడుదల చేయగా ఇప్పుడు రెండో టీజర్ ను నటుడు దర్శకుడు జె డి చక్రవర్తి గారు విడుదల చేసారు. 
 
ఈ సందర్భంగా జె డి చక్రవర్తి మాట్లాడుతూ “అని చిత్రాలలో హారర్ చిత్రం చేయటం చాలా కష్టం. దర్శకుడి సామర్థ్యం పైనే హారర్ చిత్రం విజయవంతం అవుతుంది. కానీ వీర్ సాగర్ కి హారర్ చిత్రాలపై మంచి పట్టు ఉంది. తాను కథ చెప్పేటప్పుడే మంచి ఎనర్జీ తో వివరిస్తాడు. నాకు ఈ కథ బాగా నచ్చింది. ఖచ్చితంగా హిట్ అవుతుంది. ఒక దర్శకుడు హీరో గా నటిస్తూ దర్శకత్వం వహించటం చాలా కష్టం కానీ వీర్ సాగర్ రెండు బాగా బ్యాలన్స్ చేసాడు.  శ్రీ రాపాక అద్భుతంగా నటించింది. ఇలాంటి నటన నేను ఎప్పుడు చూడలేదు. మరణం అనేది చాలా పాజిటివ్ టైటిల్, ఈ సినిమా విజయవంతం అవ్వాలి. అలాగే మంచి కథ దొరికితే నేను వీర్ సాగర్ కలిసి పని చేస్తాం” అని కోరుకున్నారు. 
 
హీరో దర్శకుడు వీర్ సాగర్ మాట్లాడుతూ “మా మరణం చిత్రం టీజర్ ను జె డి చక్రవర్తి గారు విడుదల చేయటం చాలా సంతోషం గా ఉంది. హారర్ కథ సినిమా గా చేయమని జె డి చక్రవర్తి గరే నాకు సలహా ఇచ్చారు. మా మరణం చిత్రం హిట్ అయితే ఆ క్రెడిట్ అంత జె డి చక్రవర్తి గారిదే. అయన చాలా బిజీ గా ఉన్న మా టీజర్ విడుదల చేసారు. నేను రామ్ గోపాల్ వర్మ గారి శిస్యుడినే, అన్ని కుదిరితే జె డి చక్రవర్తి గారు నేను కలిసి  త్వరలోనే ఒక సినిమా చేస్తాం” అని తెలిపారు 
 
హీరోయిన్ శ్రీ రాపాక మాట్లాడుతూ “మా మరణం చిత్రం టీజర్ ను జె డి చక్రవర్తి గారు విడుదల చేయటం చాలా సంతోషం గా ఉంది. మా దర్శకుడు వీర్ సాగర్ నా ఫామిలీ మెంబెర్, మేము మా టెక్నీషియన్ అందరు ఒక ఫామిలీ లా పని చేసాము. మా సినిమా ని నిర్మిస్తున్న రేణుక గారికి నా ధన్యవాదాలు. మా చిత్రం విజయవంతం అవ్వాలి” అని కోరుకున్నారు. 
 
నటి నటులు : వీర్ సాగర్, శ్రీ రాపాక, మాధురి 
 
బ్యానర్ : ఓషియన్ ఫిలిం ఎంటర్టైన్మెంట్స్
 
సమర్పణ : శ్రీమతి బి రేణుక
 
చిత్రం పేరు : మరణం 
 
కెమెరా మాన్ : కె వి వరం 
 
సంగీతం : మనోజ్ కుమార్ చేవూరి
 
ఎడిటర్ & వి.ఎఫ్.ఎక్స్ : నరేన్ 
 
ఎస్.ఎఫ్.ఎక్స్ : షఫీ 
 
డి.ఐ : రవి తేజ 
 
ప్రొడక్షన్ కో ఆర్డినేటర్ : బి శ్రీనివాస్ 
 
కాస్ట్యూమ్స్ : నీలిమ