మరో రికార్డు సృష్టించిన అర్జున్ రెడ్డి

Published On: September 5, 2017   |   Posted By:
మరో రికార్డు సృష్టించిన అర్జున్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సూపర్ హిట్ అయిన అర్జున్ రెడ్డి సినిమా అటు ఓవర్సీస్ లో కూడా వసూళ్ల వర్షం కురిపిస్తోంది. బోల్డ్ కంటెంట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఓవర్సీస్ ప్రేక్షకుల్ని కూడా మెప్పించడంలో సూపర్ సక్సెస్ అయింది. ఇప్పటికే మిలియన్ డాలర్ క్లబ్ లోకి చేరిన ఈ మూవీ తాజాగా మరో రికార్డు సృష్టించింది. ఏకంగా 1.5 మిలియన్ క్లబ్ లోకి ఎంటరైంది.
ఈ ఏడాది 1.5 మిలియన్ క్లబ్ లోకి ఎంటరైన ఐదో సినిమాగా రికార్డు సృష్టించింది అర్జున్ రెడ్డి. మరో 2 రోజుల్లో ఈ సినిమా, గౌతమీపుత్ర శాతకర్ణిని కూడా క్రాస్ చేయబోతోంది. ప్రస్తుతం టాప్-5లో బాహుబలి-2 నంబర్ వన్ లో కొనసాగుతుండగా.. ఖైదీ నంబర్ 150, ఫిదా, గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాలు 2,3,4 స్థానాల్లో కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఐదో స్థానంలో ఉన్న అర్జున్ రెడ్డి, త్వరలోనే 4వ స్థానానికి ఎగబాకే అవకాశాలున్నాయి.
ఓవర్సీస్ లో ఈ సినిమాకు మరింత ప్రమోషన్ కల్పించేందుకు కుదిరితే అమెరికాలో పర్యటించాలని భావిస్తోంది అర్జున్ రెడ్డి టీం. ఇప్పటికే ఈ సినిమా నిర్మాతలకు ఓవర్ ఫ్లో లాభాలు వచ్చాయి.