మరో లుక్ తో దుమ్ముదులిపిన ఎన్టీఆర్

Published On: August 7, 2017   |   Posted By:
మరో లుక్ తో దుమ్ముదులిపిన ఎన్టీఆర్
లవకుమార్ తెరపైకొచ్చాడు. ఫస్ట్ లుక్ తో దుమ్ముదులిపాడు. నిజానికి జై లవకుశ సినిమాకు ఇదే ఫస్ట్ లుక్ కాదు. ఇంతకుముందు జై క్యారెక్టర్ తో ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. టీజర్ కూడా వచ్చేసింది. కాకపోతే లవకుమార్ క్యారెక్టర్ కు సంబంధించి ఇదే ఫస్ట్ లుక్. ఆ లుక్ ఈరోజు రిలీజైంది.
జై క్యారెక్టర్ తో తనలోని నెగెటివ్ షేడ్స్ ను చూపించిన ఎన్టీఆర్.. ఈసారి పూర్తిగా లవర్ బాయ్ గా మారిపోయాడు. లవకుమార్ లుక్ లో పక్కా జెంటిల్ మేన్ అనిపించుకుంటున్నాడు తారక్. అయితే లవకుమార్ క్యారెక్టర్ తో రెండు పోస్టర్లు రిలీజ్ చేయడం ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. దీని వెనక ఓ గమ్మత్తయిన విషయం కూడా ఉంది.
లవకుమార్ లుక్ రిలీజ్ లో భాగంగా చాలా  స్టిల్స్ నుంచి ఫైనల్ గా 2 ఫొటోలు సెలక్ట్ చేశారు. ఆ రెండింటిలోంచి ఒకటి ఎంపిక చేయడం మాత్ర ఎవరితరం కాలేదు. ఎందుకంటే రెండూ రెండే. అందుకే ఆ రెండు లుక్స్ ను విడుదల చేశారు. ఫస్ట్ ఎన్టీఆర్ ఒక లుక్ రిలీజ్ చేస్తే, 10నిమిషాలు గ్యాప్ ఇచ్చి కల్యాణ్ రామ్ మరో లుక్ రిలీజ్ చేశాడు.