మరో సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చిన సాయిధరమ్ తేజ్

Published On: September 23, 2017   |   Posted By:
మరో సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చిన సాయిధరమ్ తేజ్
బీవీఎస్ రవి దర్శకత్వంలో చేస్తున్న జవాన్ సినిమాను ఇలా కంప్లీట్ చేశాడో లేదో అప్పుడే మరో సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చాడు సాయిధరమ్ తేజ్. వినాయక్ దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ హీరోగా కొత్త సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. హైదరాబాద్ లో ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ లో సాయిధరమ్ తేజ్ పై కొన్ని సన్నివేశాలు తెరకెక్కిస్తున్నాడు. దసరా వరకు ఈ షెడ్యూల్ ఉంటుంది. దసరాకు కాస్త గ్యాప్ తీసుకొని తిరిగి షెడ్యూల్ కొనసాగిస్తారు.
వినాయక్ దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ నటిస్తున్న ఈ సినిమాకు ఇంకా పేరుపెట్టలేదు. లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా ఎంపికైంది. వినాయక్ ఆస్థాన రచయిత ఆకుల శివ ఈ సినిమాకు కథ అందిస్తున్నాడు. కంప్లీట్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా, కామెడీ ప్రధానాంశంగా ఈ సినిమా రాబోతోంది.
ఈ మూవీకి దుర్గ అనే టైటిల్ అనుకుంటున్నారు. కానీ ఇంకా అఫీషియల్ గా ఎనౌన్స్ చేయలేదు. మరోవైపు మ్యూజిక్ డైరక్టర్ గా తమన్ పేరు వినిపిస్తోంది. ఆ విషయాన్ని కూడా ఇంకా పక్కా చేయలేదు. దసరా తర్వాత ఈ రెండు విషయాలపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.