మర్డర్ మూవీ రివ్యూ

Published On: December 24, 2020   |   Posted By:

మర్డర్ మూవీ రివ్యూ

తండ్రి కే ఫర్.. ‘మర్డర్’ రివ్యూ

Rating:2.5/5

రీసెంట్ గా రెండు  తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఒక పరువు హత్య స్ఫూర్తితో కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందిన చిత్రం మర్డర్. ఆ సంఘటన ఏమిటో అందరికీ తెలుసు. ఆ సంఘటనను అడ్డం పెట్టుకుని తన సినిమాకు కావాల్సినంత పబ్లిసిటీ సంపాదించారు వర్మ. ఓ దశలో సినిమా రిలీజ్ ఆగిపోతుందేమో అని అంతా అనుకున్నారు. అయితే వర్మ కోర్టులోనూ తన మాటే నెగ్గించుకుని థియోటర్స్ కు సినిమాని తీసుకువచ్చారు. ఇన్ని వివాదాలు,కోర్టు తీర్పులతో బయిటకు వచ్చిన ఈ సినిమా ఏ మేరకు జనాలని ఆకర్షిస్తుంది. మీడియాలో ప్రచారం అవుతున్నట్లు, అందరూ భావిస్తున్నట్లు మిర్యాలగూడ పరువు హత్యకి ఈ కథకీ సంబంధం ఉందా? ఈ సినిమాతోనైనా ఆయ‌న‌ హిట్టు కొట్టారా? వంటి విషయాలు రివ్యూలో చూద్దాం..

స్టోరీ లైన్

మాధవరావు (శ్రీకాంత్ అయ్యింగార్) ఓ వెల్ సెటిల్డ్ బిజినెస్ మ్యాన్. సొసైటిలో ఓ రెస్పక్పబుల్ పర్శన్. ఆయన భార్య వనజ (గాయిత్రి భార్గవ),గారాల కుమార్తె నమ్రత (సాహితి)తో హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తూంటాడు. కూతురంటే ప్రాణం కావటంతో ఏది అడిగితే అది కాదనకుండా క్షణాల్లో అమరుస్తూంటాడు. పాప పెద్దదై,పెళ్లి వయస్సు వచ్చింది అని మంచి సంభంధం కోసం వెతుకుతూంటాడు. ఈ లోగా ఆమె ఇంట్లో ఓ బాంబ్ పేలుస్తుంది. తను ఓ అబ్బాయిని ప్రేమించానని అతని పేరు ప్రవీణ్ అని రివీల్ చేస్తుంది. ప్రవీణ్ గురించి ఎక్వైరీ చేసి అతను తన ఆస్ది కోసం, తన పరువు పోగొట్టడం కోసమే తన కూతురుని ముగ్గులోకి దించాడని భావిస్తాడు. దాంతో కూతురికి నచ్చచెప్పబోయి విఫలమై హౌస్ అరెస్ట్ చేస్తాడు. దాంతో అప్పటిదాకా పెంచుకున్న ప్రేమ అంతా విషంగా మారుతుంది. ఇద్దరి మధ్యా విభేధాలు,ద్వేషం మొదలవు తుంది.  ఈ లోగా తను ప్రేమించన వాడినే పెళ్లాడని ఫిక్సైన నమ్రత అతన్ని సీక్రెట్ గా పెళ్లి చేసుకుంటుంది. దాంతో మాధవరావుకు మండిపోతుంది. కోపం తారాస్దాయికి వెళ్లిపోతుంది. ఆ కోపంలో ద్వేషంలో ఓ దుర్మార్గమైన నిర్ణయం తీసుకుంటాడు. ప్రవీణ్ ని చంపేయమని సుపారీ ఇచ్చేస్తాడు. అప్పుడే ఏమైంది. చివరకు నమ్రత ప్రేమ కథ ఏ మలుపు తిరిగింది హ్యాపీగా నడుస్తున్న ఆ కుటుంబంలో ఆ ప్రేమ వ్యవహారం ఎలాంటి చిచ్చు పెట్టింది. చివరకు నమ్రత జీవితం ఏమైంది వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
 
స్క్రీన్ ప్లే ఎనాలసిస్..

కోర్టులో వర్మ ఏం చెప్పినా..సినిమా చూసిన వారికి ఇది ఖచ్చితంగా మిర్యాలగూడ కేసుకు సంభబందించిన సంఘటనను బేస్ చేసుకుని తీసారనే విషయం స్పష్టంగా అర్దమవుతుంది. అయితే యదార్ద సంఘటనను ఉన్నది ఉన్నట్లు తెరకెక్కించటం చాలా కష్టం. అలాగే ఎవరికీ దొరకకుండా జాగ్రత్తలు తీసుకుంటూ సినిమా చేయటం మరింత కష్టం. అయితే వర్మ ఈ విషయంలో చాలా భాగం సక్సెస్ అయ్యారు. డాక్యుమెంటరీ అవ్వకుండా సినిమాలోకి జాగ్రత్తగా డ్రామా తీసుకొచ్చారు. అఫ్ కోర్స్ అది కొన్ని చోట్ల శృతిమించి మెలోడ్రామాగా మారింది. ముఖ్యంగా ఆయన తన దృష్టిని మొత్తం ఎమోషన్స్ ని రైజ్ చేయటంలో పెట్టారు. ఫస్టాఫ్ లో కాంప్లిక్ట్ లోకి త్వరగానే రావటడంతో సినిమా పరుగెత్తింది. అయితే సెకండాఫ్ కు వచ్చేసరికి తమ బిడ్డ తమను కాదని వెళ్లటం, ఆ ఆవేదన చుట్టూ కథ నడిపారు. దాంతో ఆ సీన్స్ బోర్ కొట్టాయి. మళ్లీ కథ..మర్డర్ సీన్స్ వైపు వెళ్తున్నప్పుడు వేడిక్కింది.  క్లైమాక్స్ మళ్లీ నార్మల్ గానే ఉంది. అప్ అండ్ డౌన్స్ కథనంలో ఎక్కువ అయ్యాయి. స్క్రీన్ ప్లే విషయంలో మరికాస్త జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేదనిపిస్తుంది. అలాగే కొన్ని చోట్ల తండ్రి క్యారక్టర్ ఎమోషన్స్ ని పదే పదే చూపుతూంటే ఏదో టీవి సీరియల్ చూస్తున్న ఫీలింగ్ వచ్చింది. దాన్ని ఎవాయిడ్ చేసి ఉంటే బాగుండేది.

నటీనటుల్లో…

ఈ సినిమాలో వర్మ నమ్మింది..శ్రీకాంత్ అయ్యంగార్ ని. ప్రాణంగా పెంచుకున్న కూతురు తమని కాదని వెల్లిపోతే ఎలా ఉంటుందనే ఆవేదనను స్పష్టంగా శ్రీకాంత్ తన ముఖంలో చూపించారు. అక్కడ పాత్ర కనపడదు. ఓ తండ్రి మాత్రమే మనకు కనపడతారు. అలాగే తండ్రి లాంటిదే కూతురు కూడా . ఎంతో పట్టుదలతో తన ప్రేమను గెలిపించుకోవాలని చూస్తుంది. ఆ పాత్రలో సాహితి చక్కగా చేసింది. ఇక  శ్రీకాంత్ అయ్య‌ర్ త‌మ్ముడు పాత్ర‌లో గిరిధ‌ర్ కూడా బాగా చేసారు.

దర్శకత్వం మిగతా విభాగాలు..

డైరెక్ట‌ర్ ఆనంద్ చంద్ర సినిమాను వర్మ మేకింగ్ స్టైల్ ని అనుకరిస్తూ తెర‌కెక్కించారు. అయితే.. చాలా చోట్ల సీన్స్ చాలా స్లోనేరేషన్ లో నడపటంతో టీవీ సీరియల్ చూస్తున్నట్లు అనిపించింది. ఇక  డి.ఎస్‌.ఆర్ సంగీతం, జ‌గ‌దీష్ చీక‌టి కెమెరా వర్క్ ఇంప్రెసెవ్ గా ఉన్నాయి. ప్రవీణ్ హత్య చేసే సమయంలో వచ్చే రీరికార్డింగ్ అయితే అలా గుర్తుండిపోతుంది.  ఆర్ట్ డిపార్టమెంట్, ఎడిటింగ్ తమ పనితనం చూపించాయి. ప్రొడక్షన్ వ్యాల్యూస్ విషయానికి వస్తే లిమెటెడ్ బడ్జెట్,లొకేషన్స్ లోనే రిచ్ గా తీసారు.
 
చూడచ్చా

ఓ సారి ట్రై చేయచ్చు. మరీ వర్మ గత చిత్రాల్లా విసిగించే పోగ్రాం పెట్టుకోదు.
 
తెర వెనక..ముందు

నటీనటులు: శ్రీకాంత్ అయ్యంగార్,గాయత్రీ భార్గవి,సాహితీ, గిరిధర్,దీపక్, గణేష్ తదితరులు
కెమెరా: జగదీష్ చీకటి
సంగీతం: డి ఎస్ ఆర్
ఎడిటింగ్: శ్రీకాంత్ పట్నాయక్.ఆర్
నిర్మాతలు: నట్టి కరుణ, నట్టి క్రాంతి
స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: ఆనంద్ చంద్ర
రన్ టైమ్: 2 గంటల 11 నిముషాలు
విడుదల: 24-12-2020