మళ్లీ మళ్లీ చూశా చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి

Published On: February 11, 2019   |   Posted By:

మళ్లీ మళ్లీ చూశా చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చెసుకున్న” ” 

అనురాగ్ కొణిదెన హీరోగా పరిచయమవుతొన్న “మళ్లీ మళ్లీ చూశా”. క్రిషి క్రియేషన్స్ పతాకంపై సాయిదేవ రామన్ దర్శకత్వంలో కె.కోటేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్వేత అవస్తి, కైరవి తక్కర్ హీరొయిన్ లుగా నటిస్తున్నారు. నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తిచెసుకున్న ఈ సినిమా  సెన్సార్ కు సిద్దమయింది.

దర్శకుడు సాయిదేవ రామన్ .. ప్రేమకు ప్రకృతి తోడైతే ఎంతో అందంగా ఉంటుందన్న కాన్సెప్ట్ తొ తీసిన సినిమా “మళ్ళీ మళ్ళీ చూశా” . శ్రవణ్ భరద్వాజ్ సంగీతం, సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫీ ఎసెట్స్ గా నిలుస్తాయి. నిర్మాత ఈ సినిమా ప్రారంభం నుంచి  మాకు ఎంతో సపొర్ట్ చెస్తూ వచ్చారు.నిర్మాణాంతర కార్యక్రమాలు ముగిసాయి. త్వరలొనె సెన్సార్ కు సినిమా వెళ్లనుందన్నారు.

నిర్మాత కోటేశ్వరరావు మాట్లాడుతూ.మనస్సుకు హత్తుకునే అహ్లాదకరమైన చిత్రం మా “మళ్లీ మళ్లీ చూశా”. ఇటీవలె సినిమాను చూశాము. సెన్సార్ కార్యక్రామాలు ముగించి త్వరలొనె ప్రేక్షకుల ముందుకు సినిమాను తీసుకువస్తామన్నారు.

ఈటివి ప్రభాకర్, టి.ఎన్.ఆర్, మిర్చి కిరణ్, అప్పాజీ, బ్యాంక్ శీను, మధుమణి, పావని,ప్రభావతి, జయలక్ష్మి, రీతూ చౌదరి తదితరులు నటించినఈ చిత్రానికి సంగీతం: శ్రవణ్ భరద్వాజ్, ఛాయాగ్రాహకుడు : సతీష్ ముత్యాల,మాటలు : హేమంత్ కార్తీక్,ఎడిటర్ : సత్య గిడుతూరి,పాటలు : తిరుపతి జావాన,కళా దర్శకుడు : సుమిత్ పటేల్ బి.ఫ్.ఏ,ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : సాయి సతీష్ పాలకుర్తి, నిర్మాత : కోటేశ్వరరావు .కె. కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : సాయిదేవ రామన్.

3 Attachments