మళ్లీ రావా ఫస్ట్ వీకెండ్ వసూళ్లు

Published On: December 12, 2017   |   Posted By:
మళ్లీ రావా ఫస్ట్ వీకెండ్ వసూళ్లు
అక్కినేని హీరో సుమంత్ ఎట్టకేలకు డీసెంట్ విజయం అందుకున్నాడు. అతడు నటించిన లేటెస్ట్ మూవీ మళ్లీ రావా రోజురోజుకు ఊపందుకుంటోంది. మౌత్ టాక్ పాజిటివ్ గా  ఉండడంతో రోజురోజుకు ఈ సినిమాకు కలెక్షన్లు పెరుగుతున్నాయి. విడుదలైన మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో షేర్ కోటి రూపాయలుంటే.. రెండో రోజు ఈ షేర్ 2 కోట్ల 50లక్షల రూపాయలకు పెరిగింది. మూడో రోజైన ఆదివారం కూడా ఈ మూవీకి తెలుగు రాష్టాల్లో మంచి వసూళ్లు వచ్చాయి. అలా విడుదలైన ఈ 3 రోజుల్లో మళ్లీ రావా మూవీ 8 కోట్ల రూపాయల గ్రాస్ సాధించింది. అన్ని ఖర్చులు తీసేస్తే.. ఈ మూవీకి ఫస్ట్ వీకెండ్ అటుఇటుగా 5 కోట్ల రూపాయల షేర్ వచ్చే అవకాశముంది.
ఈ సినిమాతో మళ్లీ ట్రాక్ పైకొచ్చాడు సుమంత్. గౌతమ్ తిన్ననూరి డైరక్ట్ చేసిన ఈ సినిమాతో ఆకాంక్ష సింగ్ తెలుగు తెరకు పరిచయమైంది. శ్రవణ్ భరద్వాజ్ సంగీతం సినిమాకు మెయిన్ ఎట్రాక్షన్ గా నిలిచింది.