మహానటి ఫస్ట్ లుక్ అదిరిపోయింది

Published On: October 17, 2017   |   Posted By:
మహానటి ఫస్ట్ లుక్ అదిరిపోయింది
ఈరోజు కీర్తిసురేష్ పుట్టినరోజు. ఆమె నటిస్తున్న తాజా చిత్రం మహానటి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో స్వప్న సినిమా, వైజయంతీ మూవీస్ బ్యానర్లు సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి.  ఆమె పుట్టినరోజు సందర్భంగా యూనిట్ ఫస్ట్ లుక్ విడుదల చేసింది. కేవలం కీర్తిసురేష్ కళ్లు మాత్రమే కనిపించేలా రిలీజ్ చేసిన పోస్టర్ అదిరిపోయింది.
ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తే నిజంగా అమె సావిత్రిలానే ఉంది. కానీ అవి కీర్తిసురేష్ కళ్లు. అంత చక్కగా పోస్టర్ ను డిజైన్ చేశారు. మరీ ముఖ్యంగా సావిత్రి పాత్ర కోసం దర్శకుడు నాగ్ అశ్విన్.. కీర్తి సురేష్ ను ఏరికోరి మరీ ఎందుకు సెలక్ట్ చేశాడనే విషయం ఈరోజు విడుదలైన ఫస్ట్ లుక్ చూస్తే అర్థమౌతుంది. రిలీజ్ చేసిన పోస్టర్ లో ఆకాశ వీధిలో అందాల జాబిలి అనే క్యాప్షన్ కూడా పెట్టారు. గతంలో సావిత్రి నటించిన ఓ సూపర్ హిట్ సాంగ్ లోని సాహిత్యం ఇది.