మహానటి మూవీ టీజర్ రివ్యూ  

Published On: April 16, 2018   |   Posted By:
మహానటి మూవీ టీజర్ రివ్యూ

 
అవే కళ్లు.. అదే పర్సనాలిటీ.. అదే నవ్వు.. ఏంటో సావిత్రి మళ్లీ పుట్టినట్టు అనిపించింది. నిజం.. మహానటి టీజర్ చూసిన ప్రతి ఒక్కరి ఫీలింగ్ ఇది. ఒక్క ఫ్రేమ్ లో కూడా కీర్తిసురేష్ కనిపించలేదు. మహానటి కళ్లకు కట్టింది. అది కీర్తిసురేష్ గొప్పదనమా.. లేక దర్శకుడు నాగ్ అశ్విన్ పనితనమా..? ఏమో.. టీజర్ మాత్రం మాయచేసింది. సరిగ్గా 50 సెకెన్లలో అమాంతం 60-70ల నాటి కాలానికి లాక్కెళ్లిపోయింది. మహానటి టీజర్ గురించి ఇంతకంటే ఇంకేం చెప్పలేం.
సినిమా ఏదో మేజిక్ చేయబోతోంది.. మన మనసుకు హత్తుకోబోతోంది అనే విషయాన్ని మహానటి టీజర్ చెప్పకనే చెప్పేసింది. దర్శకుడి విజన్, కీర్తిసురేష్ తపన, మిక్కీ జే మేయర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సమంత, విజయ్ దేవరకొండల అప్పీయరెన్స్.. ఇలా దేనికదే టీజర్ లో ప్రత్యేకంగా నిలిచింది. మరీ ముఖ్యంగా సినిమాలో కట్టిపడేసే ఆర్ట్ వర్క్, లైటింగ్ ఉండబోతోందనే విషయం మహానటి టీజర్ తో స్పష్టమైంది.
ఓవరాల్ గా తెలుగు ప్రేక్షకులు మరో మంచి సినిమా అనుభూతికి సిద్ధమైపోవచ్చు. మే 9న మహానటి వచ్చేస్తోంది. అంతా రెడీ అయిపోండి.