మహానటి మూవీ షూటింగ్ పూర్తి

Published On: March 22, 2018   |   Posted By:

మహానటి మూవీ షూటింగ్ పూర్తి

మేటినటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతోంది మహానటి సినిమా. కీర్తి సురేష్ లీడ్ రోల్ లో నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయింది. ఈరోజు ఉదయం ఈ సినిమాకు సంబంధించి గుమ్మడికాయ ఫంక్షన్ నిర్వహించారు. సావిత్రి చిత్రపటం పెట్టి, నివాళులు అర్పిస్తూ షూటింగ్ ముగించారు.

సావిత్రి కెరీర్ లోని ఎత్తుపత్తాల్ని, ఆమె వ్యక్తిగత జీవితంలోని చీకటి కోణాన్ని సైతం ఈ బయోపిక్ లో చూపించబోతున్నారు. సమంత ఇందులో జర్నలిస్ట్ పాత్ర పోషిస్తోంది. ఆమె పాత్ర ద్వారానే సావిత్రి జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరించబోతున్నారు. విజయ్ దేవరకొండ, మోహన్ బాబు, దుల్కర్ సల్మాన్, షాలినీ పాండే లాంటి నటులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. మే9న సావిత్రి సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది. ఏప్రిల్ లో ఈ మూవీకి సంబంధించి అధికారిక ప్రచారం ప్రారంభం అవుతుంది. ఈ సినిమా హక్కుల్ని జీ తెలుగు సంస్థ దక్కించుకుంది.