మహానటి సెట్స్ పైకొచ్చిన మోహన్ బాబు

Published On: October 21, 2017   |   Posted By:
మహానటి సెట్స్ పైకొచ్చిన మోహన్ బాబు
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు మహానటి సెట్స్ పైకొచ్చాడు. సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహానటుడు ఎస్వీ రంగారావు పాత్రలో కనిపించబోతున్నారు మోహన్ బాబు. సినిమాలోని ఓ సన్నివేశంలో మాయాబజార్ లో ఎస్వీఆర్ పోషించిన ఘటోత్కచుని పాత్రలో మోహన్ బాబు కనిపించబోతున్నారట.
నిన్నట్నుంచి రామోజీ ఫిలింసిటీలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. వారం రోజుల పాటు ఈ షెడ్యూల్ కొనసాగుతుంది. షెడ్యూల్ లో భాగంగా మోహన్ బాబు, కీర్తిసురేష్ మధ్య కొన్ని సన్నివేశాలు తీయబోతున్నారు. స్వప్న సినిమాస్ బ్యానర్ పై ప్రియాంక దత్ నిర్మిస్తున్న ఈ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకుడు.
పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ.. మోహన్ బాబు స్క్రీన్ ప్రెజన్స్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తుందని అంటోంది యూనిట్. తెలుగు-తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రంలో అర్జున్ రెడ్డి ఫేం షాలిని పాండే కూడా నటిస్తున్న విషయ తెలిసిందే.