మహేష్ తో మరో సినిమా గ్యారెంటీ – కొరటాల శివ

Published On: April 24, 2018   |   Posted By:

మహేష్ తో మరో సినిమా గ్యారెంటీ – కొరటాల శివ

వరుస హిట్స్ తో దూసుకుపోతున్న కొరటాల శివ, తాజాగా భరత్ అనే నేను సినిమాతో మరో హిట్ కొట్టాడు. కేవలం సక్సెస్ అందుకోవడం మాత్రమే కాదు, వరుస ఫ్లాపుల్లో ఉన్న మహేష్ ను సక్సెస్ ట్రాక్ లోకి తీసుకొచ్చాడు. అందుకే తమ ఇద్దరి కాంబోలో అన్నీ బ్లాక్ బస్టర్స్ మాత్రమే వస్తాయంటున్నాడు మహేష్. ఇదిలా ఉండగా.. కుదిరితే మహేష్ తో మరో సినిమా చేస్తానని ప్రకటించాడు కొరటాల.

“మహేష్ తో గతంలో శ్రీమంతుడు సినిమా చేశాడు. ఇప్పుడు భరత్ అనే నేను సినిమా చేశాడు. ఈ రెండు సినిమాల్ని మించిన కథ దొరికితే అప్పుడు మహేష్ తో సినిమా కచ్చితంగా సినిమా చేస్తాను. అలాంటి కథ దొరికినప్పుడు వెంటనే వెళ్లి మహేష్ ఇంటి తలుపు కాలింగ్ బెల్ నొక్కుతాను. కథ మొత్తం చెప్పేస్తాను.”

ఇలా భరత్ ను మించిన కథతో మళ్లీ ప్రేక్షకుల ముందుకొస్తామంటున్నాడు కొరటాల. ఈ దర్శకుడు ఈ మాట చెప్పిన వెంటనే మహేష్ కూడా నాకు కూడా ఓకే అన్నట్టు ఎక్స్ ప్రెషన్ ఇచ్చాడు. భరత్ అనే నేను థ్యాంక్స్ గివింగ్ ప్రెస్ మీట్ లో ఈ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది.