మహేష్ మూవీ అప్ డేట్స్

Published On: August 14, 2017   |   Posted By:

మహేష్ మూవీ అప్ డేట్స్

ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘భరత్ అనే నేను’ సినిమా చేస్తున్నాడు మహేష్ బాబు. ఓవైపు స్పైడర్ సినిమా షూటింగ్ బాకీ ఉన్నప్పటికీ.. కొరటాల సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చాడు. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 11న   ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. అందుకే ఈ సినిమాకు కాల్షీట్లు కేటాయించాడు మహేష్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లక్నోలో జరుగుతోంది.

ఈనెల 11 నుంచి ప్రారంభమైన ఈ షెడ్యూల్ 22వ తేదీ వరకు కొనసాగుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోందని ప్రకటించింది డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్. మహేష్ తో పాటు ప్రకాష్ రాజ్, పోసాని, రాజీవ్ కనకాల, రవిశంకర్, యష్పాల్ శర్మ పాల్గొంటున్నారని తెలిపింది.

ప్రస్తుతం షూటింగ్ లో పాల్గొంటున్న ఈ నటీనటులతో పాటు మరికొంతమంది నటుల పేర్లను కూడా ప్రకటించింది యూనిట్. శరత్ కుమార్, ఆమని, సితార కూడా ఇందులో ఉన్నారని తెలిపింది. దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకు సంగీత దర్శకత్వం వహిస్తున్నాడు. కైరా అద్వాణ హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయం అవుతోంది. ఈ షెడ్యూల్ కంప్లీట్ అయిన తర్వాత స్పైడర్ షూటింగ్ స్టార్ట్ చేస్తాడు మహేష్.