మహేష్ సినిమాలో బన్నీ బ్యూటీ?

Published On: August 14, 2017   |   Posted By:

మహేష్ సినిమాలో బన్నీ బ్యూటీ?

ఈరోజు మహేష్ బాబు 25వ సినిమా అఫీషియల్ గా లాంచ్ అయింది. ఎప్పట్లానే మహేష్ ఈ సినిమా ఓపెనింగ్ కు రాలేదు. మహేష్ భార్యతో పాటు పాప, బాబు హాజరయ్యారు. పాప సితార కెమెరా స్విచాన్ చేస్తే, బాబు గౌతమ్ క్లాప్ కొట్టాడు. వంశీ పైడిపల్లి డైరక్షన్ లో రానున్న ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించబోతున్నాడు.

అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయాన్ని మాత్రం యూనిట్ ఇంకా చెప్పలేదు. కానీ సినిమాలో హీరోయిన్ పై ఇప్పటికే స్పెక్యులేషన్ స్టార్ట్ అయింది. తాజా సమాచారం ప్రకారం ఈ మూవీలో మహేష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించే అవకాశాలున్నాయి. నిజానికి ఈ విషయాన్ని డీజే సినిమా ప్రమోషన్ టైమ్ లోనే పూజా చూచాయగా చెప్పేసింది. అయితే యూనిట్ మాత్రం సస్పెన్స్ మెయింటైన్ చేస్తోంది.

వైజయంతీ మూవీస్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై మహేష్ 25వ సినిమా రాబోతుంది. దిల్ రాజు, అశ్వనీదత్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తారు. అతి త్వరలో హీరోయిన్ గా అఫీషియల్ స్టేట్ మెంట్ ఇవ్వబోతున్నారు.