మార్కెట్ వాల్యూ మరింత పెంచుకున్న నాని

Published On: July 17, 2017   |   Posted By:

మార్కెట్ వాల్యూ మరింత పెంచుకున్న నాని

నేచురల్ స్టార్ నాని మార్కెట్ వాల్యూ ఈ ఏడాదిలోనే దాదాపు డబుల్ అయింది. తాజాగా విడుదలైన నిన్నుకోరి సినిమాతో నాని మార్కెట్ ఇంకాస్త పెరిగింది. ఈ సినిమాను విడుదలకు ముందే 20 కోట్ల రూపాయలకు అమ్మేశారు. విడుదలైన వారం రోజుల్లోనే బయ్యర్లంతా సేఫ్ జోన్ లోకి వచ్చేశారు. దీంతో నానికి బయ్యర్లు, ఎగ్జిబిటర్లలో మరింత వాల్యూ పెరిగింది.

కేవలం లోకల్ గానే కాకుండా.. ఓవర్సీస్ లో కూడా ఈ హీరో డిపెండబుల్ అనిపించుకుంటున్నాడు. అక్కడ కూడా కళ్ల ముందే 10లక్షల డాలర్లు ఆర్జించి పెట్టాడు. నిన్నుకోరి సినిమాకు వారం కూడా తిరక్కుండానే మిలియన్ డాలర్ వసూళ్లు వచ్చాయి.  దీంతో ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లు కూడా నానిపై అపారమైన నమ్మకం పెట్టుకున్నారు.

ఓవర్సీస్ లో మిలియన్ డాలర్ సంపాదించిన సినిమాల్లో నానికి ఇది వరుసగా నాలుగో మూవీ కావడం విశేషం. గతంలో ఈగ, భలే భలే మగాడివోయ్, నేను లోకల్ సినిమాలు ఓవర్సీస్ లో 10లక్షల డాలర్లు ఆర్జించాయి. సో.. ఓవరాల్ గా నాని మార్కెట్ వాల్యూ ఇంకాస్త పెరిగిందన్నమాట.