మాస్టర్ మూవీ రివ్యూ

Published On: January 13, 2021   |   Posted By:

మాస్టర్ మూవీ రివ్యూ

నమస్తే ..“మాస్టర్”: “మాస్టర్” రివ్యూ

Rating:2/5

కొంతకాలం క్రితం వరకూ తమిళ డబ్బింగ్ సినిమాలేవీ పండక్కి రిలీజయ్యేవి కావు. కానీ గత కొన్నేళ్లుగా సీన్ మారింది. అవి కూడా ప్రతిసారీ అత్యుత్సాహంగా సంక్రాంతి రేసులో నిలుస్తున్నాయి. ఒక్కోసారి స్టైయిట్ సినిమాలకు పోటీ ఇస్తున్నారు. ఇంతకుముందు సూర్య సినిమా ‘గ్యాంగ్’, ఆ తర్వాత రజినీకాంత్ చిత్రాలు ‘పేట’; ‘దర్బార్’ సంక్రాంతికే రేసులో నిలిచాయి.అయితే అవి చూపిన ప్రభావం అంతంతమాత్రం.  సంక్రాంతి సినిమాల జోరు ముందు అవి ఏమాత్రం నిలవలేకపోయాయి. ఇప్పుడు కూడా ఓ తమిళ డబ్బింగ్ సినిమా సంక్రాంతి రేసులోకి వచ్చింది. అదే విజయ్ సినిమా ‘మాస్టర్’. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తున్న అనూహ్య క్రేజ్ నెలకొనింది. ఎందుకా క్రేజో అందరికీ తెలుసు. ఖైది వంటి సూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడు తదుపరి సినిమా ఇది. ఖైదీ తెలుగులోనూ పెద్ద హిట్టైంది. అందుకే ఇక్కడా ఈ సినిమాకు క్రేజ్ వచ్చింది. మరి ఆ క్రేజ్ ని ఏ మాత్రం ఈ సినిమా క్యాష్ చేసుకోబోతోంది. తెలుగులో ఎలాగైనా నిలదొక్కుకోవాలని ప్రయత్నం చేస్తున్న విజయ్ కు ఈ సినిమా ఆ అవకాసం ఇస్తుందా రివ్యూలో చూద్దాం.

స్టోరీలైన్

జేడీ(విజయ్) ఓ పేరున్న సైకాలజీ ప్రొఫెసర్. అతను ఎంత తాగినా స్టూడెంట్స్ తో స్నేహంగా ఉంటూ, వారితో కలిసిపోతూంటాడు. కాబట్టి అతను క్లాసులకు తాగొచ్చినా యాజమాన్యం మందలించటానికి కూడా మొహమాటపడుతుంది. అయితే మేనేజ్మెంట్ కు అతనంటే మంట. ఆ కడుపు మంట చల్లాల్చుకునే అవకాసం ఓ సారి వస్తుంది. కాలేజ్ ఎలక్షన్స్ కు మేనేజ్మెంట్ కు ఇష్టం లేకపోయినా సాయిం చేసి ఇరుక్కుంటాడు జేడీ. దాంతో మూడు నెలలు కాలేజీ వదిలేసి వెళ్లాల్సి వస్తుంది. ఎక్కడకి వెళ్తాడు అంటే ఓ  జువైనల్ అబ్జర్వేషన్ హోం కు. అక్కడ బాల నేరస్దులు ఉంటారు. అయితే ఆ  జువైనల్ అబ్జర్వేషన్ హోం అన్నిటిలాంటిది కాదు. అక్కడ బాల నేరస్దులను డ్రగ్స్ కు బానిసలు గా చేసుకుని భవానీ(విజయ్ సేతుపతి) తనకు అనువుగా క్రైమ్స్ చేయిస్తూంటాడు. ఈ విషయం అక్కడికి వెళ్లిన కొద్ది రోజులుకే తెలుసుకున్న జేడీ ఏం చేసాడు. అక్కడ పరిస్దితులను ఎలా చక్క దిద్దాడు అనేది మిగతా కథ.
 
స్క్రీన్ ప్లే..ఎనాలసిస్

కార్తీ హీరోగా వచ్చిన ‘ఖైదీ’ సినిమా చాలా మందికి నచ్చటానికి కారణం ఆ సినిమాని నేరేట్ చేసిన విధానం స్క్రీన్ ప్లే. చాలా కొత్తగా అనిపించింది. దాంతో అదే దర్శకుడు సినిమా అనగానే ఆ స్దాయి లేదా అంతకు మించి ఎక్సపెక్ట్ చేయటం సహజం. అయితే డైరక్టర్ అవన్ని వదిలేసాడు. తన దగ్గర ఓ స్టార్ ఉన్నాడు. అతన్ని ఏ విధంగా చూపించి ఫ్యాన్స్ చేత విజిల్స్ వేయించాలి. క్రేజీ కాంబినేషన్ ఎలా సెట్ చేయాలి అనే వాటిపై దృష్టి పెట్టాడు. విజయ్ సేతుపతిని, అనిరుధ్ వంటి టెక్నిషియన్స్ ని సీన్ లోకి తెచ్చాడు. అయితే అన్నిటికన్నా ముందు ఇవన్ని కలిపే కథ చేయలేకపోయాడు. పైన చదివిన కథలో మలుపు ఎక్కడైనా ఉందా.. హీరో జువైనల్ అబ్జర్వేషన్ హోం కు వచ్చాడు. అక్కడ అక్రమాలు ఎదుర్కొన్నాడు అనేదే ఉంది. అంతేకానీ బలమైన సంఘటనలు లేవు. దానికి తోడు విలన్ కు,హీరో కు మధ్య వార్ ..వన్ సైడ్ గా జరుగుతూంటుంది. ఎక్కడా వీళ్లద్దరూ ఎదురుపడరు. ఎప్పుడైతే కలిసారో అక్కడే క్లైమాక్స్ వచ్చేసి కథ అయ్యిపోతుంది. ఇలాంటి స్క్రీన్ ప్లే నుంచి ఏం ఆశించగలం. ప్యాసివ్ హీరోయిజం ఎంతమాత్రం బలంగా ఉండదు. ముఖ్యంగా మాస్ సినిమాల్లో హీరో,విలన్ కాంప్లిక్ట్స్ ఎంత బలంగా ఉంటే అంతలా వర్కవుట్ అవుతుంది. అందరినీ లైన్ లో పెట్టగలిగే విజయ్ వంటి హీరో ఉన్నప్పుడు అవతల ఎంత బలమైన విలన్ ఉన్నా..సీన్స్ చాలా హై స్టాండర్డ్స్ లా ఉండాలి. అంతేకానీ హీరో ఎలివేషన్స్,బిల్డప్ ల మీద దృష్టిపెడితే ఏముంటుంది. అదే జరిగింది. విజయ్ వంటి హీరో దొరికాడు కదా అని అతని దారిలోకి వెళ్లిపోయాడు డైరక్టర్. అతని నుంచి ఆశించేది వదిలేసాడు.

డైరక్షన్ ,మిగతా డిపార్టమెంట్స్

స్క్రిప్టుని వదిలేసిన డైరక్షన్ ఎప్పుడూ రాణించదు. ఎంత గొప్ప షాట్స్ ఉన్నా ఫలితం ఉండదు. సీన్స్ లో ఇంటెన్సిటీ లేనప్పుడు ఎంత గొప్ప స్టార్స్ తెరపై మాట్లాడుకుంటన్నా..ఆసక్తి పుట్టదు. అదే ఈ సినిమాకు జరిగింది.అది వందకు వంద శాతం దర్శకుడు వైఫల్యమే.  ఇంటర్వెల్‌ బ్యాంగ్‌, జ్యువనైల్ హోంలో ఆడే కబడీ సీన్స్ మినహా చెప్పుకునేందుకు ఏమీ లేదు. ఇక మిగతా విభాగాల్లో అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, పాటలు బాగున్నాయి. విజయ్ వంటి స్టార్ ఉన్నప్పుడు హై స్టాండర్డ్స్ టెక్నీషియన్స్ ఉంటారు. అదే కోవలం  సత్యం సూర్యన్‌ సినిమాటోగ్రఫీ అదిరింది. ఎడిటర్ మాత్రం ఎందుకనో చాలా ల్యాగ్ లు ఉంచేసి విసిగించేసాడు.  

నటీనటుల్లో విజయ్ ఎప్పటిలాగే తన స్టైల్స్ పై దృష్టి పెట్టుకుంటూ వెళ్లిపోయారు.  ఇక వైవిద్యమైన నటుడుగా గుర్తింపు తెచ్చుకున్న  విజయ్‌ సేతుపతి కష్టం కనిపించింది. మాళవికా మోహనన్‌ గురించి చెప్పుకునేందుకు ఏమీ లేదు.నాజర్ ఆండ్రియా, అర్జున్‌ దాస్‌, శాంతన్‌ భాగ్యరాజ్‌ వంటి వారు అలా చేసుకుంటూ వెళ్లిపోయారు.
 
చూడచ్చా

ఓటీటిలో ట్రై చేయచ్చు…రిస్క్ చేసి ఈ కరోనా టైమ్ లో వెళ్లాలనిపించేటంత సినిమా కాదు

 తెర వెనక..ముందు..

బ్యానర్‌: ఎక్స్‌బీ ఫిలిం క్రియేటర్

నటీనటులు: విజయ్‌, విజయ్‌ సేతుపతి, మాళవిక మోహనన్‌, భాగ్యరాజ్‌, అర్జున్‌ దాస్‌, నాజర్‌, రమ్య సుబ్రమణియన్‌ తదితరులు

సంగీతం: అనిరుధ్‌ రవిచంద్రన్‌

సినిమాటోగ్రఫీ: సత్యన్‌ సూర్యన్‌

ఎడిటింగ్‌: ఫిలోమిన్‌ రాజ్‌

నిర్మాత: జేవియర్‌ బ్రిట్టో

కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: లోకేశ్‌ కనకరాజ్‌
 
లెంగ్త్:  179 నిమిషాలు

సెన్సార్‌: యు/ఎ

తెలుగు విడుదల: ఈస్ట్‌కోస్ట్‌ ప్రొడక్షన్స్‌ మహేశ్‌ కోనేరు

విడుదల: 13-01-2021