మా లో స‌భ్య‌త్వం తీసుకున్న యువ‌హీరో వ‌రుణ్‌

Published On: November 21, 2017   |   Posted By:
మా లో స‌భ్య‌త్వం తీసుకున్న యువ‌హీరో వ‌రుణ్‌
యంగ్ ట్యాలెంటెడ్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు వ‌రుణ్‌. వ‌రుణ్ న‌టించిన `ల‌జ్జ‌`, `మ‌న‌లో ఒక‌డు` తెలుగు ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ పొందిన సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే ప్ర‌క‌టించిన నంది పుర‌స్కారాల్లో `మ‌న‌లో ఒక‌డు` (2016) చిత్రానికి అవార్డు ద‌క్క‌డం విశేషం. ఆర్‌.పి.ప‌ట్నాయ‌క్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. బ్యాక్‌గ్రౌండ్ తో ప‌ని లేకుండా న‌వ‌త‌రం ట్యాలెంటుకు ఆద‌రణ ద‌క్కుతున్న ప్ర‌స్తుత సినారియోలో వ‌రుణ్ హీరోగా నిరూపించుకునేందుకు త‌న‌వంతు హార్డ్ వ‌ర్క్ చేస్తున్నాడు.
హీరో వ‌రుణ్  మూవీ ఆర్టిస్టుల సంఘం (మా)లో స‌భ్య‌త్వం తీసుకున్నారు. మా అధ్య‌క్షులు శివాజీ రాజా స‌మ‌క్షంలో తాను కూడా `మా`లో స‌భ్యుడిన‌వ్వ‌డం చాలా సంతోషంగా ఉంద‌ని వ‌రుణ్ తెలిపారు. ప్ర‌తిష్ఠాత్మ‌క `మా అసోసియేష‌న్‌`లో స‌భ్య‌త్వం మ‌రింత బాధ్య‌త పెంచింద‌ని, చ‌క్క‌ని క‌థాంశం ఉన్న చిత్రాల్ని ఎంచుకుని న‌టిస్తాన‌ని తెలిపారు. మా అధ్య‌క్షులు శివాజీ రాజా మాట్లాడుతూ .. న‌వ‌త‌రం న‌టీన‌టుల ప్ర‌తిభ‌కు టాలీవుడ్‌లో కావాల్సినంత ప్రోత్సాహం ఉంది. వ‌రుణ్ పెద్ద హీరోగా ఎద‌గాల‌ని ఆకాంక్షిస్తున్నా.. అని అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న నిర్మాత, `మా` ఈసీ మెంబ‌ర్ సురేష్ కొండేటి, న‌టులు హ‌రిబాబు, శ్రీ‌నివాస్ .. “న‌వ‌త‌రం హీరో వ‌రుణ్ ప్ర‌తిభ‌ను నిరూపించుకుని, పెద్ద స్థాయికి ఎద‌గాల‌“ని ఆకాంక్షించారు.
Source:-Press – Note