మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమా వీడియో జూమ్ కాన్ఫ్ రెన్స్

Published On: November 24, 2020   |   Posted By:
మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమా వీడియో జూమ్ కాన్ఫ్ రెన్స్
 
 
తెలుగుతో పాటు మిగ‌తా భాషల్లో కూడా ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందుతున్న మిడిల్ క్లాస్ మెలోడీస్
 
యంగ్ హీరో ఆనంద్ దేవ‌ర‌కొండ‌, టాలెంటెడ్ హీరోయిన్ వ‌ర్ష బొల‌మ్మ జంట‌గా నూత‌న ద‌ర్శ‌కుడు వినోద్ తెర‌కెక్కించిన సినిమా మిడిల్ క్లాస్ మెలోడీస్, ప్ర‌ముఖ ఓటిటి వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో న‌వంబ‌ర్ 20న విడుద‌లైన ఈ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ టాక్ తో ప్రేక్ష‌కాద‌‌ర‌ణ పొందుతుంది.
 
ఈ సంద‌ర్భంగా జరిగిన‌ వీడియో జూమ్ కాన్ఫ్ రెన్స్ ద్వారా మిడిల్ క్లాస్ మెలోడీస్ వ‌ర్చువ‌ల్ స‌క్సెస్ మీట్ లో చిత్ర హీరో ఆనంద్ దేవ‌ర‌కొండ‌, హీరోయిన్ వ‌ర్ష బొల‌మ్మ‌, స‌హ‌న‌టులు చైత‌న్య‌, దివ్య త‌దిత‌రులు పాల్గొన్నారు, వారితో పాటు చిత్ర నిర్మాత భవ్య క్రియేష‌న్స్ అధినేత ఆనంద్ ప్ర‌సాద్, ఎక్స్ క్యూటివ్ ప్రొడ్యూస‌ర్ అన్నేర‌వి, సంగీత ద‌ర్శ‌కుడు శ్రీక‌ర్, ద‌ర్శ‌కుడు వినోద్ త‌దిత‌రులు హాజ‌రైయ్యారు.
 
 
ఈ సంద‌ర్భంగా హీరో ఆనంద్ దేవ‌ర‌కొండ మాట్లాడుతూ అమెజాన్ ద్వారా సినిమా విడుద‌ల అవ్వ‌డం కార‌ణంగా మా మిడిల్ క్లాస్ మెలోడీస్ కి దేశ వ్యాప్తంగా గుర్తింపు వ‌చ్చింది, ఈ సినిమా స‌క్సెస్ క్రెడిట్ మా టీమ్ అంద‌రికీ చెందుతుంది అన్నారు.
 
 
నిర్మాత ఆనంద్ ప్ర‌సాద్ గారు మాట్లాడుతూ ఎక్క‌డో ఉన్న మ‌ళ‌యాలంలో ఏదైనా కాన్సెప్ట్ ఓరియెటెండ్ సినిమా బాగుంటే మ‌నంద‌రం ఆ సినిమా చూసి దానీ రీమేక్ చేసి తెలుగులో కూడా తీసి ముచ్చ‌ట ప‌డుతుంటాం, అయితే డైరెక్ట్ గా తెలుగులోనే ఇలాంటి కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలు చేయ‌డం వాటిని కూడా తెలుగు ప్రేక్ష‌కులు ఆద‌రించ‌డం చాలా ఆనందంగా అనిపిస్తోంది, ఇక పై మా బ్యాన‌ర్ లో కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలుకే పెద్ద పీఠ వేస్తూ ముందుకు సాగాల‌నే నిర్ణయించుకున్నారం అన్నారు.