మిలియన్ డాలర్ బాయ్ వరుణ్ తేజ్

Published On: July 25, 2017   |   Posted By:

మిలియన్ డాలర్ బాయ్ వరుణ్ తేజ్

మెగా హీరో వరుణ్ తేజ్ ఎట్టకేలకు మిలియన్ డాలర్ క్లబ్ లోకి ఎంటరయ్యాడు. శేఖర్ కమ్ముల డైరక్షన్ లో వరుణ్ చేసిన ఫిదా సినిమా ఓవర్సీస్ ఆడియన్స్ ను ఫిదా చేస్తోంది. ఈ సినిమా అక్కడ ఎంత హిట్ అయిందంటే.. విడుదలైన జస్ట్ 2 రోజులకే 6.6 మిలియన్ డాలర్ల వసూళ్లు వచ్చేశాయి. ఇక నిన్నటితో 10లక్షల డాలర్లు.. అంటే మిలియన్ డాలర్ క్లబ్ లోకి ఎంటరైంది ఫిదా సినిమా. అలా వరుణ్ తేజ్.. మిలియన్ డాలర్ హీరోగా మారిపోయాడు. ఈ హీరోకు ఓవర్సీస్ లో స్ట్రాంగ్ బేస్ క్రియేట్ చేసింది ఫిదా సినిమా.

కేవలం వరుణ్ తేజ్ ఒక్కడికే కాదు, హీరోయిన్ సాయి పల్లవికి కూడా ఫిదా కలిసొచ్చింది. తెలుగులో చేసిన మొదటి సినిమాకే సూపర్ హిట్ కొట్టేసింది. అలనాటి మేటి తార భానుమతి పేరును ఫిదాలో సాయి పల్లవి పాత్రకు పెట్టారు. ఆ పేరుకు ఏమాత్రం తీసిపోని విధంగా సాయిపల్లవి అదరగొట్టేసింది. సినిమా మొత్తానికి బ్యాక్ బోన్ గా నిలిచింది.

ఈ సినిమాతో దిల్ రాజు పంట పండింది. దిల్ రాజు తీసిన ప్రతి సినిమా ఓవర్సీస్ లో ఆడుతోంది. ఫిదా కూడా మిలియన్ డాలర్ క్లబ్ లోకి చేరింది. త్వరలోనే ఇది 2 మిలియన్ డాలర్లు ఆర్జిస్తుందని అంచనా వేస్తున్నారు.