మిల‌ట‌రీ ఆఫీస‌ర్‌గా తార‌క్‌

Published On: September 25, 2017   |   Posted By:

మిల‌ట‌రీ ఆఫీస‌ర్‌గా తార‌క్‌

మిల‌ట‌రీ ఆఫీస‌ర్‌గా తార‌క్‌.యువ క‌థానాయ‌కుడు ఎన్టీఆర్..తెలుగు ప్రేక్ష‌కులకు ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. రీసెంట్‌గా విడుద‌లైన  ‘జైల‌వ‌కుశ‌’లో మూడు విభిన్న పాత్ర‌లు చేసి మెప్పించాడు. ముఖ్యంగా న‌త్తితో మాట్లాడే జై పాత్ర అత‌నికి మంచి పేరుని తీసుకువ‌చ్చింది. ప్ర‌తినాయ‌కుడి ఛాయ‌లున్న ఈ పాత్ర‌లో తార‌క్ విశ్వ‌రూపం చూపించాడు.

 

ఇప్పుడు ఎన్టీఆర్ ఎలాంటి పాత్ర‌లో క‌న‌ప‌డబోతాడోన‌ని అంద‌రిలో ఆస‌క్తి మొద‌లైంది. త‌న త‌దుప‌రి చిత్రంలోనూ ఓ కొత్త పాత్ర‌లో క‌నిపించేందుకు ఎన్టీఆర్ సిద్ధ‌మ‌వుతున్నాడ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో చేయ‌నున్న చిత్రంలో తార‌క్ మిల‌ట‌రీ ఆప‌రేట‌ర్ ఆఫీస‌ర్‌గా క‌నిపించ‌నున్నాడ‌ని టాలీవుడ్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి.

 

మ‌రి ఈ వార్త‌ల్లో ఎంత నిజ‌ముందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. ప‌వ‌న్ సినిమాతో బిజీగా ఉన్న త్రివిక్ర‌మ్ శ్రీనివాస్  అది పూర్తి కాగానే తార‌క్‌తో సినిమా మొద‌లు పెడ‌తాడు.