మిస్ట‌రీ స్టోరీలో క‌ల్యాణ్ రామ్‌

Published On: February 7, 2018   |   Posted By:

మిస్ట‌రీ స్టోరీలో క‌ల్యాణ్ రామ్‌

నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ హీరోగా, నిర్మాత‌గా త‌న‌దైన శైలిలో రాణిస్తున్నారు. ప్ర‌స్తుతం క‌ల్యాణ్ రామ్ హీరోగా రెండు సినిమాల‌ను చేస్తున్నారు. అందులో ఒక‌టి… `ఎం.ఎల్‌.ఎ` ( అన్నీ మంచి ల‌క్ష‌ణాలున్న అబ్బాయి) కాగా మ‌రొక‌టి జయేంద్ర ద‌ర్శ‌క‌త్వంలో `నా నువ్వే`. ఈ రెండు సినిమాల త‌ర్వాత క‌ల్యాణ్‌రామ్‌తో ఎం.ఎల్‌.ఎ నిర్మాత‌లు మ‌రో సినిమా చేయ‌డానికి రెడీ అవుతున్నారట‌. మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ నేప‌థ్యంలో సినిమా నడుస్తుంది. గ‌తంలో మారుతి నిర్మాణంలో విడుద‌లైన `గ్రీన్ సిగ్న‌ల్` ద‌ర్శ‌కుడు విజ‌య్ మ‌ద్దాలి ఈ సినిమాకు ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్నాడు. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించిన వివ‌రాలు అధికారికంగా వెలువ‌డ‌తాయి.