మెంటల్ మదిలో మూవీ రివ్యూ

Published On: November 24, 2017   |   Posted By:

మెంటల్ మదిలో మూవీ రివ్యూ

నటీ నటులు : శ్రీ విష్ణు , నివేత పేతు రాజ్, అమృత, శివాజీ రాజా, అనిత తదితరులు

సంగీతం : ప్రశాంత్ విహారి

కెమెరా : వెదరామన్

నిర్మాణం : ధర్మపథ క్రియేషన్స్

నిర్మాత : రాజ్ కందుకూరి

కథ – స్క్రీన్ ప్లే – దర్శకత్వం : వివేక్ ఆత్రేయ

రిలీజ్ డేట్ : 24 -11 2017

పెళ్లిచూపులు లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత రాజ్ కందుకూరి మరో సినిమా చేస్తున్నాడంటే సహజంగానే అందరికీ ఆసక్తి ఉంటుంది. అందుకే ఈసారి ఈ నిర్మాత మరింత జాగ్రత్తపడ్డాడు. బడ్జెట్ ను కంట్రోల్ లో ఉంచుతూనే, సరికొత్త కథను సెలక్ట్ చేసుకున్నాడు. క్రేజ్ వచ్చింది కదా అని స్టార్ కాస్ట్ కు పోకుండా.. కథకు తగ్గ నటీనటుల్ని ఎంచుకున్నాడు. అలా ఈరోజు థియేటర్లలోకి వచ్చింది మెంటల్ మదిలో. కొత్తకుర్రాడు వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో.. శ్రీవిష్ణు-నివేత పేతురాజ్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.

కథ

చిన్నతనం నుంచి ప్రతి విషయంలో కన్ఫ్యూజ్ అవుతుంటాడు హీరో అరవింద్ కృష్ణ (శ్రీవిష్ణు). ఏ వైపు నుంచి వెళ్లాలా అనే డైలమా నుంచి అసలు పొద్దున లేచిన తర్వాత ఏ చొక్కా వేసుకోవాలని తికమక వరకు ఇలా ప్రతి విషయంలో హీరోకి కన్ఫ్యూజనే ఉంటుంది. ఆ కన్ఫ్యూజన్ పెళ్లిచూపులకు కూడా వర్తిస్తుంది. తన తికమతో ఏ అమ్మాయినీ అంగీకరించడు శ్రీవిష్ణు. ఎట్టకేలకు ఓ పెళ్లిచూపుల్లో స్వేచ్ఛను (నివేత పేతురాజ్)ను చూసి ఓకే చెప్పేస్తాడు. ఆమె తనకు పర్ఫెక్ట్ అనుకుంటాడు. అంతా ఓకే అనుకున్న టైమ్ లో నివేత కూడా తనకు సూట్ కాదు, పెళ్లి  కాన్సిల్ అని చెప్పేస్తాడు శ్రీవిష్ణు. ఈ సీన్ తో ఇంటర్వెల్ బ్యాంగ్ పడుతుంది.

ముందు ఓకే చేసిన శ్రీవిష్ణు, తర్వాత ఎందుకు వద్దాన్నడనే విషయాన్ని ఇంటర్వెల్ తర్వాత రివీల్ చేశారు. సహజంగానే కన్ఫ్యూజన్ మాస్టర్ అయిన మన హీరో ఓ పనిమీద ఢిల్లీ వెళ్తాడు. అక్కడ విజయవాడ అమ్మాయి రేణుక (అమృత శ్రీనివాసన్) పరిచయమౌతుంది. ఆమెకు విపరీతంగా ఎట్రాక్ట్ అయిపోతాడు శ్రీవిష్ణు. అప్పటికే ఓకే చేసేసిన నివేత కంటే అమృతానేన తనకు బెస్ట్ అనుకుంటాడు. అలా నివేతకు నో కూడా చెప్పేస్తాడు. ఇక అక్కడ్నుంచి తన జీవితంలో ఒక్కో విషయంపై క్లారిటీ తెచ్చుకున్న హీరో.. ఫైనల్ గా నివేత తనకు కరెక్ట్ అని భావించి, ఆమెను మరోసారి ఒప్పించి పెళ్లి చేసుకోవడంతో సినిమా ముగుస్తుంది.

ప్లస్ పాయింట్స్

–      డైరక్షన్

–      హీరోహీరోయిన్ల రొమాన్స్

–      మ్యూజిక్

–      డైలాగ్స్

–      ఇంటర్వెల్ ట్విస్ట్

–      క్లైయిమాక్స్

మైనస్ పాయింట్స్

–      సెకెండాఫ్ లో స్లో నెరేషన్

–      శ్రీవిష్ణు, సెకెండ్ హీరోయిన్ (అమృత) లవ్ ట్రాక్

–      ఫస్టఫ్ లో కొన్ని రొటీన్ సీన్స్

బిజినెస్ ఆఫ్ టాలీవుడ్ రివ్యూ

చెప్పుకోడానికి కథ సింపుల్ గానే ఉంది. కానీ ఇంత కన్ఫ్యూజన్ స్టోరీని హ్యాండిల్ చేయాలంటే ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండకూడదు. మొదటి సినిమానే అయినప్పటికీ ఈ విషయంలో వివేక్ ఆత్రేయ ది బెస్ట్ అనిపించాడు. తను కన్ఫ్యూజ్ కాకుండా.. ప్రేక్షకుల్ని గందరగోళానికి గురిచేయకుండా.. పెద్ద పెద్ద ట్విస్టులు పెట్టకుండా కథను స్మూత్ గా హ్యాండిల్ చేశాడు. కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం విభాగాల్ని వివేక్ ఆత్రేయ హ్యాండిల్ చేసిన విధానం చూస్తే ముచ్చటేస్తుంది. అతడు ఎంత హోం వర్క్ చేశాడనే విషయం సినిమాలో కనిపిస్తుంది.

ఇక వివేక్ కు సగం భారం తగ్గించాడు మ్యూజిక్ డైరక్టర్ ప్రశాంత్ విహారి. సూతింగ్ మ్యూజిక్ తో సినిమాకు భలే ప్లస్ అయ్యాడు. రీ-రికార్డింగ్ తో పాటు వినసొంపైన పాటలతో సినిమాకు సెకెండ్ ఎట్రాక్షన్ గా నిలిచాడు. వీళ్లకు వేదరామన్ కెమెరా పనితనం, రాజ్ కందుకూరి ప్రొడక్షన్ వాల్యూస్, ఎడిటింగ్ మంచి బ్యాలెన్సింగ్ ఇచ్చింది.

ఇక నటీనటుల విషయానికొస్తే కన్ఫ్యూజింగ్ క్యారెక్టర్ లో శ్రీవిష్ణు భలే సెట్ అయ్యాడు. సహజంగానే అతడి కళ్లలో ఓ రకమైన అయోమయం, గందరగోళం నిత్యం కనిపిస్తుంటుంది. ఈ పాత్రకు అవి చాలా హెల్ప్ అయ్యాయి. అప్పట్లో ఒకడుండేవాడు సినిమాతో పోలిస్తే ఇందులో శ్రీవిష్ణు డైలాగ్ డెలివరీ ఓ వంద శాతం మెరుగుపడింది. కోలీవుడ్ బ్యూటీ నివేత పెతురాజ్ తన పర్ఫార్మెన్స్ తో క్యూట్ లుక్ తో  మెస్మరైజ్ చేసి సినిమాకు మరో హైలైట్ గా నిలిచింది. రేణుక క్యారెక్టర్ తో అమృత శ్రీనివాసన్ జస్ట్ పరవాలేదనిపించుకుంది. ఇక చాలా రోజుల తర్వాత శివాజీ రాజా తన కామెడి టైమింగ్ తో ఎంటర్టైన్ చేశాడు. అనిత, మధుమణి, కిరీటి మిగతా నటీ నటులు తమ క్యారెక్టర్స్ కి పర్ఫెక్ట్ అనిపించుకుని పాత్రల్లో ఒదిగిపోయారు

సెకెండాఫ్ లో కాస్త నెమ్మదిగా సాగే స్క్రీన్ ప్లే, కొన్ని రొటీన్ సన్నివేశాలు మినహాయిస్తే.. ఓ మంచి సినిమా చూసిన అనుభూతిని కలిగిస్తుంది మెంటల్ మదిలో మూవీ.

రేటింగ్ – 3/5