మెకానిక్ పాత్ర‌లో మ‌హేష్‌

Published On: February 17, 2018   |   Posted By:
మెకానిక్ పాత్ర‌లో మ‌హేష్‌
సూప‌ర్‌స్టార్ మ‌హేష్ ఇప్పుడు భ‌ర‌త్ అనే నేను సినిమాను ఏప్రిల్ 26న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు రావ‌డానికి సిద్ధంగా ఉన్నారు. దీని తర్వాత మ‌హేష్ త‌న 25వ సినిమాను వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా త‌ర్వాత మహేష్ ఏ సినిమా చేస్తాడ‌నే దానిపై ప‌లు ర‌కాలైన వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.
గ‌త ఏడాది అర్జున్‌రెడ్డితో స‌క్సెస్ అందుకున్న సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాను తెరకెక్కిస్తాడ‌ట‌. విన‌ప‌డుతున్న స‌మాచారం ఏంటంటే ఈ సినిమాలో మ‌హేష్ మెకానిక్ పాత్ర‌లో న‌టించ‌బోతున్నాడ‌ని టాక్‌.