మెర్క్యురి మూవీ రివ్యూ

Published On: April 13, 2018   |   Posted By:
మెర్క్యురి మూవీ రివ్యూ
తెలుగు విడుద‌ల‌:  కె.ఎఫ్‌.సి ప్రొడ‌క్ష‌న్స్‌
నిర్మాణ సంస్థ‌లు : స‌్టోన్ బెంచ్ ప్రై.లి., పెన్ ఇండియా లిమిటెడ్‌
తారాగ‌ణం: ప‌్ర‌భుదేవా,  ఇందూజ‌, ర‌మ్య నంబీశ‌న్, స‌న‌త్ రెడ్డి, దీప‌క్ ప‌ర‌మేశ్‌, పురుషోత్త‌మ్‌,త‌దిత‌రులు
ఎడిటింగ్‌: వివేక్ హ‌ర్ష‌న్‌
బ్యాగ్రౌండ్ స్కోర్‌: స‌ంతోశ్ నారాయ‌ణ్‌
కెమెరా: తిరునావుక్క‌ర‌సు
నిర్మాత‌లు: జ‌యంతి లాల్‌, కార్తికేయ‌న్ సంతానం
క‌థ‌, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం:  కార్తీక్ సుబ్బ‌రాజు

సెన్సార్ – యు

రిలీజ్ డేట్ – ఏప్రిల్ 13, 2018
రన్ టైం – 108 నిమిషాలు
ఒక‌ప్పుడు సినిమాలంటే మాలంటే మూకీ సినిమాలే. అయితే టాకీ సినిమా వ‌చ్చిన త‌ర్వాత సినిమా రంగంలో విప్ల‌వాత్మ‌క మార్పులు వ‌చ్చాయి. మూకీ సినిమాలు క‌నుమ‌రుగైయ్యాయి. అయితే విల‌క్ష‌ణ‌త‌కు పెద్ద పీట వేసే క‌మ‌ల్ హాస‌న్ 30 ఏళ్ల క్రితం సింగీతం శ్రీనివాస‌రావు ద‌ర్శ‌క‌త్వంలో `పుష్ప‌క విమానం` అనే మూకీ సినిమా చేసి విజ‌యాన్ని సాధించారు. త‌ర్వాత మ‌రెవ్వ‌రూ మూకీ సినిమాను చేయ‌నేలేదు. అయితే 30 ఏళ్ల త‌ర్వాత ద‌ర్శ‌కుడు కార్తీక్ సుబ్బ‌రాజ్ ద‌ర్శ‌క నిర్మాణంలో చేసిన మూకీ సినిమాయే `మెర్క్యురి`. అస‌లు కార్తీక్ సుబ్బ‌రాజ్ మూకీ సినిమా ఎందుకు చేశాడ‌నే తెలుసుకుందాం..
క‌థ‌:
ఓ ఐదుగురు స్నేహితులు.. స్నేహితురాలి పుట్టిన‌రోజును జ‌రుపుకోవ‌డానికి గెస్ట్ హౌస్‌కు వెళ‌తారు. వీరు మాట్లాడ‌లేరు.. విన‌ప‌డ‌వు. పార్టీ పూర్త‌యిన త‌ర్వాత తిరుగు ప్ర‌యాణంలో వీరి కారు ఓ గుడ్డి వ్య‌క్తిని గుద్దేస్తుంది. ఆ వ్య‌క్తే ప్ర‌భుదేవా. భ‌యంతో స్నేహితులు శ‌వాన్ని ఓ ఫ్యాక్ట‌రీలో పూడ్చేస్తారు. త‌ర్వాత రోజున చూస్తే శ‌వం ఉన్న‌చోట ఉండ‌దు. వారిలో ఓ అమ్మాయికి క‌న‌ప‌డ‌కుండా పోతుంది. అస‌లు ఆ గుడ్డివ్య‌క్తి చ‌నిపోయాడా?  లేదా? అస‌లు అమ్మాయి ఎందుకు క‌న‌ప‌డ‌కుండా పోతుంది?  అనే విష‌యాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
ప్ల‌స్ పాయింట్స్‌:
– ప్ర‌భుదేవా స‌హా న‌టీన‌టుల ప‌నితీరు
– బ్యాగ్రౌండ్ స్కోర్
– సినిమాటోగ్రఫీ
మైన‌స్ పాయింట్స్‌:
– ఆస‌క్తిక‌ర‌మైన క‌థ లేక‌పోవ‌డం
– తెలుగు న‌టీన‌టులు  లేక‌పోవ‌డం
స‌మీక్ష‌:
ముందుగా ఇందులో న‌టీన‌టులు గురించి చెప్పుకోవాలంటే ప్ర‌భుదేవా గురించే చెప్పుకోవాలి. డాన్స్ మాస్ట‌ర్‌గా, మంచి న‌టుడు, హీరో, డైరెక్ట‌ర్‌గా పేరున్న ప్ర‌భుదేవా తొలిసారి విల‌న్‌గా న‌టించ‌డం విశేషం. ప్ర‌భుదేవా ఈ కొత్త ప్రాత‌కు త‌న‌దైన న‌ట‌న‌తో ప్రాణం పోశాడు. అస‌లు ద‌ర్శ‌కుడు కార్తీక్ సుబ్బరాజ్ మూకీ సినిమా అంటేనే కాస్త ఆసక్తి ఏర్ప‌డింది. అందులోనూ ప్ర‌భుదేవా విల‌న్‌గా చేశాడంటే ఈ అంచ‌నాలు పెరిగాయి. ఇక్క‌డ ప్ర‌స్తావించాల్సిన విష‌య‌మేమంటే.. పుష్ప‌క విమానం అనేది కామెడీ జోన‌ర్ అయితే.. మెర్య్కురి థిల్ల‌ర్ జోన‌ర్‌లో తెర‌కెక్కింది. పిజ్జా, చిక్క‌డు దొర‌క‌డు వంటి చిత్రాల‌తో ఆక‌ట్టుకున్న కార్తీక్ సుబ్బరాజ్ మూకీ సినిమా చేసి కొత్త‌ప్రయ‌త్నాన్ని అభినందించాల్సిందే. ఇందులో  ర‌సాయ‌నాలు త‌యారు చేసే కంపెనీలు వ‌ల్ల ఎలాంటి పరిస్థితులు త‌లెత్తుతున్నాయ‌నే విష‌యాన్ని కూడా అంత‌ర్లీనంగా ఇందులో డిస్క‌స్ చేశాడు ద‌ర్శ‌కుడు. అయితే బ‌లమైన క‌థ‌, క‌థ‌నం లేక‌పోవ‌డం. సినిమా ప్రారంభ‌మైన కాసేప‌టికే సినిమా ఎటు న‌డుస్తుంద‌నే తెలిసిపోతుంది. కాబ‌ట్టి ఆస‌క్తి స‌న్న‌గిల్లుతుంది.
బోట‌మ్ లైన్‌:  మెర్క్యురి.. మంచి ప్ర‌య‌త్నం
రేటింగ్‌: 2.75/5

Leave a Reply

Your email address will not be published.