మెహబూబా తెలుగు మూవీ ఫస్ట్ సింగిల్ రివ్యూ

Published On: April 17, 2018   |   Posted By:

మెహబూబా తెలుగు మూవీ ఫస్ట్ సింగిల్ రివ్యూ


పూరి జగన్నాధ్ దర్శక-నిర్మాతగా, ఆకాష్-నేహాషెట్టి హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం మెహబూబా. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే టీజర్ విడుదలైంది. మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. తాజాగా పాటలతో ప్రమోషన్ కూడా మొదలుపెట్టారు. ఇందులో భాగంగా ఓ ప్రియా అనే లిరిక్స్ తో సాగే పాటను విడుదల చేశారు. సందీప్ చౌతా సంగీతం అందించిన ఈ సాంగ్ ఎలా ఉందో చూద్దాం.

దేశ సరిహద్దులు, వాటి ఆంక్షల మధ్య ఒక ప్రేమ జంట ఎలాంటి పరిసస్థితులు ఎదుర్కొందనే, మెయిన్ థీమ్ ని ఎలివేట్ చేసేలా ఉంది ఈ ఫస్ట్ సింగిల్. ‘మన మట్టి మీద పగబట్టి ఎవరు గీశారో సరిహద్దులు…. ప్రేమంటే ఏంటో తెలిసుంటే వాళ్ళు ఈ గీత గీసి ఉండరు..’ లాంటి లిరిక్స్ సాహిత్య రచయిత భాస్కర భట్ల మార్క్ ని ఎలివేట్ చేస్తున్నాయి. ప్రగ్యా దాస్ గుప్తా, సందీప్ బాత్రా ఈ సాంగ్ పాడారు.

1971 ఇండో–పాక్ వార్ బ్యాక్ డ్రాప్ లో ఎమోషనల్ లవ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతుంది ‘మెహబూబా’ సినిమా. మే 11న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా విడుదలకానుంది మెహబూబా.