మెహబూబా మూవీ అప్ డేట్స్

Published On: January 11, 2018   |   Posted By:
మెహబూబా మూవీ అప్ డేట్స్
పూరి జగన్నాధ్ దర్శకత్వంలో అతడి తనయుడు ఆకాష్ హీరోగా నటిస్తున్న సినిమా
మెహబూబా. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. గ్యాప్స్ లేకుండా షెడ్యూల్స్ కొనసాగిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ లో మరో షెడ్యూల్ ముగించారు.
ప్రస్తుతం సంక్రాతి హాలీడేస్ లో మెహబూబా టీమ్, పండగ తర్వాత నెక్స్ట్ షెడ్యూల్ తో బిజీ కానుంది. 1971 లో జరిగిన ఇండో పాక్ యుద్ధం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆకాష్ సరసన నేహాశెట్టి హీరోయిన్ గా నటిస్తుంది.
అల్టిమేట్ యాక్షన్ & లవ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా పంజాబ్, రాజస్థాన్, హైదరాబాద్ లాంటి ఎగ్జోటిక్ లొకేషన్ లలో షూటింగ్ జరుపుకుంది. పూరి జగన్నాథ్ స్వయంగా నిర్మిస్తూ, దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి సందీప్ చౌతా మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. పూరి మార్క్ ఎలిమెంట్స్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాతో ఆకాష్.. కమర్షియల్ హీరోగా ఎస్టాబ్లిష్ కాబోతున్నాడు. చార్మి ఈ సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్.

Leave a Reply

Your email address will not be published.