మెహబూబా సినిమా షూటింగ్ పూర్తి

Published On: February 24, 2018   |   Posted By:
మెహబూబా సినిమా షూటింగ్ పూర్తి
పూరి జగన్నాధ్ డైరక్ట్ చేస్తూ, నిర్మిస్తున్న చిత్రం మెహబూబా. పూరి కొడుకు ఆకాష్ ఈ సినిమాలో హీరో. గ్యాప్ లేకుండా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా నిన్నటితో మొత్తం షూటింగ్ పూర్తిచేసుకుంది. హైదరాబాద్ లో గడిచిన 4 రోజులుగా చేసిన ప్యాచ్ వర్క్ తో షూటింగ్ కంప్లీట్ అయినట్టు, మెహబూబా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ చార్మి ప్రకటించింది.
1971 నాటి ఇండో-పాక్ వార్ బ్యాక్ డ్రాప్ లో మెహబూబా సినిమా వస్తోంది. ఇలాంటి జానర్ టచ్ చేయడం పూరికి ఇదే ఫస్ట్ టైం. ఆకాష్ సరసన నేహా షెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా సమ్మర్ ఎట్రాక్షన్ గా విడుదలకానుంది. సందీప్ చౌతా సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా టీజర్ ను ఏపీ, నైజాం, అమెరికాలో 800కు పైగా థియేటర్లలో విడుదల చేశారు.