మెహ‌బూబా అంటున్న పూరి

Published On: September 28, 2017   |   Posted By:

మెహ‌బూబా అంటున్న పూరి

పూరి జ‌గ‌న్నాథ్ త‌న‌యుడు ఆకాష్ పూరి హీరోగా ప‌రిచ‌యం కానున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా గురించిన ఆసక్తిక‌ర‌మైన విష‌యాల‌ను తెలియ‌జేస్తూ పూరి సినిమా టైటిల్ లోగో `మెహ‌బూబా`ను విడుద‌ల చేశారు. `స్క్రిప్ట్ పూర్త‌యిన త‌ర్వాత నేను ఇప్ప‌టి వ‌ర‌కు చేయ‌న‌టువంటి ఇన్‌టెన్స్ ల‌వ్‌స్టోరీని తెర‌కెక్కిస్తున్నాన‌ని అర్థ‌మైంది. నా కొడుక్కి సినిమాల‌పై ఉన్న ఆస‌క్తి కార‌ణంగానే ఈ సినిమాను నేను త‌న‌తో చేస్తున్నాను. ఇందులో నేహాశెట్టి హీరోయిన్‌గా న‌టిస్తుంది. 1971లో జ‌రిగిన ఇండియా, పాక్ యుద్ధ నేప‌థ్యంలో సినిమా ఉంటుంది. పంజాబ్‌, రాజ‌స్థాన్‌, హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో సినిమా షూటింగ్ ఉంటుంది. అక్టోబ‌ర్ నుండి చిత్రీక‌ర‌ణ జ‌రుగుతుంది. సందీప్ చౌతా సినిమాకు సంగీతం అందిస్తారు` అని పూరి ట్విట్ట‌ర్ ద్వారా తెలిపారు. ఈ సినిమాను పూరి త‌న స్వీయ నిర్మాణ సంస్థ పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్ బేన‌ర్‌ఫై నిర్మిస్తున్నారు.