మొక్కలు నాటిన తమిళ తలపతి విజయ్

Published On: August 12, 2020   |   Posted By:

మొక్కలు నాటిన తమిళ తలపతి విజయ్

గౌరవ రాజ్యసభ సభ్యులు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ని స్వీకరించిన ప్రముఖ తమిళ తలపతి  విజయ్ గారు . టాలీవుడ్ పాపులర్ హీరో మహేష్ బాబు గారు విసిరినా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ని స్వీకరించిన తమిళ్ తలపతి , అత్యధిక పారితోషికం తీయనుకుంటున్న అగ్ర నటుడు విజయ్ గారు ఈ రోజు చెన్నై లోని  తన నివాసం లో మొక్కలు నాటారు .

ఈ సందర్బంగా మాట్లాడుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఒక అద్భుతమైన కార్యక్రమం , ఈ కార్యక్రమం ఇప్పుడు దేశం లో ప్రముఖలందరు బాగస్వామ్యులవుతున్నారు , ఇతర దేశాలతో పోల్చితే మనదేశం లో ఒక్క మనిషి కావాల్సిన మొక్కలు చాలా తక్కువ వాటిద్వారా వచ్చే ఆక్సిజన్ సరిపోవడం లేదు , అందువల్ల దేశ రాజధాని లో ఆక్సిజన్ అమ్మే కేంద్రాలు నెలకొల్పారు అంటే మనం మొక్కలు నాటడం లో అశ్రద్ధ చూపుతున్నాం అనడానికి నిదర్శనం  . గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా మనకు తెలిసిన వాళ్లు , మనం అభిమానించే వాళ్ళు మొక్కలు నాటే విధంగా కోరడం , ఒకరి ద్వారా ఒకరికి గ్రీన్ ఛాలెంజ్ కొనసాగడం , మొక్కలు నాటడం పైన , పర్యావరణ పరిరక్షణ పైన మంచి అవగాహనా కల్పిస్తున్నా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది అని అన్నారు.