మొక్కలు నాటిన యాక్టర్ సంధ్య జానక్

Published On: August 12, 2020   |   Posted By:
మొక్కలు నాటిన యాక్టర్ సంధ్య జానక్ 
 
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు నిర్వహిస్తున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం నిర్విరామంగా సాగుతోంది.
 
ఒకరి నుండి మరొకరికి గ్రీన్ ఛాలెంజ్ స్వీకరిస్తూ సెలెబ్రిటీలు తమవంతుగా మొక్కలు నాటుతున్నారు. లోరా అమ్ము ఇచ్చిన గ్రీన్ ఛాలెంజ్ ని స్వీకరించి సంజీవయ్య పార్క్ లో మూడు మొక్కలు  నాటిన యాక్టర్ సంధ్య జానక్ 
 
ఈ సందర్భంగా యాక్టర్ సంధ్య జానక్ మాట్లాడుతూ… గౌరవ ఎంపీ సంతోష్ కుమార్ గారు నిర్వహిస్తున్న గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం అపూర్వమైనదని ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో ప్రతి ఒక్కరు మూడు మొక్కలు నటండి మనమందరం ఆకుపచ్చని తెలంగాణ చూడలనేదే మా కోరిక
 
 దేశవ్యాప్తంగా మరింత ముందుకు తీసుకెళ్లాలలి ఈ సందర్బంగా తనకు ఈ అవకాశాన్ని కల్పించిన ఎంపీ జోగినాపల్లి సంతోష్ గారికి ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందనీ అలాగే తను మరో ముగ్గురికి ఛాలెంజ్ ఇస్తున్నట్టు చెప్పారు.( యాక్టర్ శరత్ బాబు ) ( యాక్టర్ కవిత )(యాక్టర్ కోటేశ్వర రావు)  మొక్కలు నాటాల్సిందిగా కోరారు