మొక్కలు నాటిన యువ హీరోయిన్ రష్మిక మందన

Published On: July 16, 2020   |   Posted By:
మొక్కలు నాటిన యువ హీరోయిన్ రష్మిక మందన
 
అక్కినేని సమంత ఛాలెంజ్ ను  స్వీకరించిన యువ హీరోయిన్ రష్మిక మందన
 
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మహా ఉధృతంగా కొనసాగుతోంది ఈ చాలెంజ్ లో భాగంగా నటీనటులు, ప్రముఖులు పెద్ద ఎత్తున మొక్కలు నాటి తమ అభిప్రాయాలను సామాజిక మాధ్యమాలలో తెలియజేస్తున్నారు.
 
 
ప్రముఖ హీరోయిన్ అక్కినేని సమంత ఇచ్చిన చాలెంజ్ స్వీకరించి తన ఇంటి ఆవరణంలో మొక్కలు నాటిన యువ హీరోయిన్ రష్మిక మందన ఈ విషయాన్ని తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో తెలియజేయడం జరిగింది. 
 
 
ఈ చాలెంజ్ లోకి  తనను  ఆహ్వానించిన సమంతకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా తన అభిమానులను అదేవిధంగా యువతీ యువకులను పెద్ద ఎత్తున మొక్కలు నాటి ఈ యొక్క గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను ఇదేవిధంగా కొనసాగించాలని పిలుపునిచ్చారు.
 
ఈ సందర్భంగా తన సహచర హీరోయిన్లు అయిన రాశి ఖన్న,కళ్యాణి ప్రియదర్శన్ లను ఈ ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.