మొక్కలు నాటిన యువ హీరో సందీప్‌ కిషన్

Published On: August 5, 2020   |   Posted By:
మొక్కలు నాటిన యువ హీరో సందీప్‌ కిషన్
 
గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటిన యువ హీరో సందీప్‌ కిషన్‌
 
రాజసభ సభ్యులు, ప్రముఖ రాజకీయ నాయకులు జోగినిపల్లి సంతోష్‌ కుమార్‌గారు ప్రారంభించిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో యువ హీరో సందీప్‌ కిషన్‌ పాల్గొన్నారు. ఛాలెంజ్‌లో భాగంగా నటి లక్ష్మీ మంచు, నటుడు జీవన్‌రెడ్డి విసిరిన సవాల్‌ను స్వీకరించిన ఆయన, హైదరాబాద్‌లోని తమ ఇంటి ఆవరణలో మంగళవారం మొక్కలు నాటారు. 
 
సందీప్‌ కిషన్‌ మాట్లాడుతూ ‘‘ప్రకృతి ప్రేమికుడిగా మొక్కలు నాటడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. భూమితల్లి పచ్చగా ఉంటే, భూమిపై ఉన్న బిడ్డలందరూ క్షేమంగా ఉంటారు. మనకు ప్రాణవాయువు ఇచ్చే పచ్చని చెట్లు పెంచడం ముఖ్యం. మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సంతోష్‌ కుమార్‌కి కృతజ్ఞతలు. గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొనవలసిందిగా అభిమానులు, ప్రేక్షకులకు పిలుపునిస్తున్నా  అని అన్నారు.