మొక్కలు నాటిన హీరోయిన్ అశిక రంగనాథ్

Published On: August 6, 2020   |   Posted By:

మొక్కలు నాటిన హీరోయిన్ అశిక రంగనాథ్

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన యువ హీరోయిన్ అశిక రంగనాథ్

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా ముందుకు కొనసాగుతుంది ప్రముఖులు తమకు చాలెంజ్ రావడమే ఆలస్యం గ్రీన్ చాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటడం జరుగుతుంది ముఖ్యంగా రాజ్యసభ సభ్యులు సంతోష్ గారు పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చిన ఈ కార్యక్రమానికి మంచి స్పందన వస్తోంది. ప్రముఖలు తన జన్మదినం సందర్భంగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చిన పిలుపునందుకుని రాజకీయ నాయకులు; సినీ తారలు; క్రీడాకారులు అందరూ పుట్టినరోజు నాడు మొక్కలు నాటి ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలపడం జరుగుతుంది. పుట్టినరోజు సందర్భంగా తాము నాటిన మొక్కలు చాలా ప్రత్యేకంగా  ప్రేమగా పెంచుకోవడం జరుగుతుందని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ప్రముఖ హీరోయిన్ రష్మిక మందన ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి తన పుట్టిన రోజు సందర్భంగా బెంగళూరు లోని తన నివాసంలో మొక్కలు నాటిన ప్రముఖ హీరోయిన్ అశిక రంగనాథ్

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇప్పటి నుండి తాను ప్రతి ఏటా పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటుతాను అని తెలపడం జరిగింది. అదేవిధంగా తన అభిమానులు కూడా ఇదే విధంగా మీ జన్మదినం సందర్భంగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చాది. ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టి ముందుకు తీసుకుపోతున్న రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారికి అభినందనలు తెలియజేశారు.