మొదటి రోజు ‘పైసా వసూల్’ అయింది

Published On: September 2, 2017   |   Posted By:
మొదటి రోజు ‘పైసా వసూల్’ అయింది
బాలకృష్ణ, పూరి జగన్నాథ్ కాంబినేషన్ అంటేనే కిర్రాక్ పుట్టించింది. ఆ క్రేజ్ కు తగ్గట్టే మొదటి రోజు పైసా వసూల్ అనిపించుకుంది బాలయ్య 101వ చిత్రం. పక్కా మాస్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఈ సినిమా చూసి బాలయ్య ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. తేడా సింగ్ నటవిశ్వరూపం బాక్సాఫీస్ వద్ద కాసులు కురిపిస్తోంది. అలా మొదటి రోజు పైసా వసూల్ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో 7 కోట్ల 88 లక్షల రూపాయల షేర్ వచ్చింది.
ఆంధ్రప్రదేశ్/నైజాం మొదటి రోజు షేర్ వివరాలు:
నైజాం – రూ. 1.60 కోట్లు
సీడెడ్ – రూ. 1.80 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 0.80 కోట్లు
ఈస్ట్ – రూ. 0.70 కోట్లు
వెస్ట్ – రూ. 0.55 కోట్లు
గుంటూరు – రూ. 1.54 కోట్లు
కృష్ణా – రూ. 0.52 కోట్లు
నెల్లూరు – రూ. 0.37 కోట్లు
టోటల్ షేర్ – రూ. 7.88 కోట్లు