మోహనకృష్ణ దర్శకత్వంలో సుధీర్ బాబు సినిమా

Published On: November 4, 2017   |   Posted By:

మోహనకృష్ణ దర్శకత్వంలో సుధీర్ బాబు సినిమాసుధీర్ బాబు, అదితీ రావ్ హైదరీ జంటగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో శ్రీదేవి మూవీస్ సినిమా

గత ఏడాది నానితో ‘జెంటిల్ మెన్’ వంటి హిట్ చిత్రాన్ని రూపొందించిన దర్శక-నిర్మాతలు ఇంద్రగంటి మోహన కృష్ణ-శివలెంక కృష్ణప్రసాద్ మరో కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టారు. ఇందులో సుధీర్ బాబు హీరోగా నటించనున్నారు. ప్రముఖ బాలీవుడ్ కథానాయిక, ఇటీవల మణిరత్నం దర్శకత్వంలో ‘చెలియా’ సినిమా చేసిన అదితీ రావ్ హైదరీ హీరోయిన్ గా చేయనున్నారు . శ్రీదేవి మూవీస్ పై ప్రొడక్షన్ 10గా ఈ చిత్రం రూపొందనుంది.

దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ మాట్లాడుతూ – ”అనూహ్యమైన కథాంశంతో ఆద్యంతం వినోదాత్మకంగా నడిచే ఒక కొత్త తరం ప్రేమకథా చిత్రమిది” అన్నారు.

నిర్మాత శివలెంక కష్ణప్రసాద్ మాట్లాడుతూ – ”డిసెంబర్ రెండో వారంలో షూటింగ్ స్టార్ట్ చేస్తాం. వేసవి కానుకగా ఏప్రిల్ లో సినిమాని విడుదల చేయాలనుకుంటున్నాం. ‘జెంటిల్ మెన్’ తర్వాత మళ్లీ ఇంద్రగంటితో సినిమా నిర్మించడం ఆనందంగా ఉంది. ఇతర తారాగణం, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలియజేస్తాం” అని చెప్పారు.

 

Source:-Press – Note