మ‌ణిర‌త్నం  న‌వాబ్ జూలై  రిలీజ్ 

Published On: February 13, 2018   |   Posted By:

మ‌ణిర‌త్నం  న‌వాబ్ జూలై  రిలీజ్ 

ఇండియ‌న్ ఏస్ డైరెక్ట‌ర్ మ‌ణిర‌త్నం ఇప్పుడు భారీ మ‌ల్టీస్టార‌ర్ సినిమా చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. `చెక్క చివంద వాన‌మ్‌` అనే పేరుతో త‌మిళంలో.. `న‌వాబ్‌` పేరుతో తెలుగులో సినిమా విడుద‌ల కానుంది. అర‌వింద్ స్వామి, విజ‌య్ సేతుప‌తి, జ్యోతిక‌, అదితీరావ్ హైద‌రీ, ఐశ్వ‌ర్యా రాజేష్‌, ప్ర‌కాష్ రాజ్‌, మ‌న్సూర్ అలీఖాన్ తారాగ‌ణంగా న‌టిస్తున్నారు. 60 రోజుల్లో చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేస్తార‌ట‌. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌న్నింటినీ పూర్తి చేసుకుని సినిమాను జూలైలో విడుద‌ల చేయాల‌ని నిర్మాత‌లు యోచిస్తున్నారు. మ‌ద్రాస్ టాకీస్‌తో పాటు లైకా ప్రొడ‌క్ష‌న్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఎ.ఆర్‌.రెహ‌మాన్ సంగీతం అందిస్తున్నారు.