మ‌ణిర‌త్నం సినిమా వివ‌రాలు

Published On: September 18, 2017   |   Posted By:
మ‌ణిర‌త్నం సినిమా వివ‌రాలు
మ‌ణిర‌త్నం త‌దుప‌రి సినిమా గురించి మీడియా ప‌లు వార్త‌లు విన‌ప‌డుతూ వ‌చ్చాయి .అయితే ఈరోజు ఈవార్త‌లన్నింటికీ ఫుల్‌స్టాప్ పెట్టేశారు చిత్ర‌యూనిట్‌. మ‌ణిర‌త్నం త‌దుప‌రి చిత్రం వ‌చ్చే ఏడాది జ‌న‌వరిలో ప్రారంభం అవుతుంది. ఈ సినిమాకు సంబంధించి మ‌ణిర‌త్నం అండ్ టీం అధికార‌క ప్రెస్‌నోట్‌ను ఇచ్చారు. దీని ప్ర‌కారం త‌దుప‌రిగా మ‌ణిర‌త్నం చేయ‌బోయే సినిమా మ‌ల్టీస్టార‌ర్ అని క‌న్‌ఫ‌ర్మ్ అయ్యింది. ఇందులో అర‌వింద‌స్వామి, శింబు, విజ‌య్ సేతుప‌తి, ఫ‌హాద్ ఫాజిల్‌, జ్యోతిక‌, ఐశ్వ‌ర్య రాజేష్ త‌దిత‌రులు న‌టిస్తున్నారు. అయితే ఇందులో నాని పేరు లేదు. గ‌తంలో ఇందులో నాని న‌టిస్తాడ‌ని వార్త‌లు వ‌చ్చాయి మ‌రి.  ఈ సినిమాను వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి నుండి ప్రారంభిస్తార‌ట‌. ఎ.ఆర్‌.రెహ‌మాన్ సినిమాకు సంగీతం అందిస్తే, సంతోష్ శివ‌న్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.