మ‌ణిశ‌ర్మ హ‌వా

Published On: August 10, 2017   |   Posted By:
మ‌ణిశ‌ర్మ హ‌వా
ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోలు  చిరంజీవి, బాల‌కృష్ణ‌, నాగార్జున‌, వెంక‌టేష్‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, మ‌హేష్ బాబు, ఎన్టీఆర్‌, ప్ర‌భాస్‌, రామ్‌చ‌ర‌ణ్‌, అల్లు అర్జున్‌, ర‌వితేజ ఇలా రెండు త‌రాల అగ్ర క‌థానాయ‌కులంద‌రితో ప‌నిచేసి స్టార్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా పేరు సంపాదించుకున్నాడు మెలోడి బ్ర‌హ్మా మ‌ణిశ‌ర్మ‌. మ‌ధ్య‌లో సినిమాలు త‌గ్గిపోయాయి. ఈ మ‌ధ్య మ‌ణిశ‌ర్మ మ‌ళ్లీ వ‌రుస సినిమాలో బిజీ బిజీగా మారారు.
గ‌త ఏడాది నాని జెంటిల్‌మేన్‌తో స‌క్సెస్ కొట్టిన మ‌ణిశ‌ర్మఈ ఏడాదిలో ముఖ్యంగా ఈ మూడు నెల‌ల కాలంలో ఐదు సినిమాల‌తో సంద‌డి చేశారు. జూన్‌లో అమీ తుమీ, ఫ్యాష‌న్ డిజైన‌ర్‌, జ‌య‌దేవ్ చిత్రాల‌తోనూ.. జులైలో శ‌మంత‌క‌మ‌ణితోనూ సంద‌డి చేసిన మ‌ణి.. ఆగ‌స్టులో లైతో ప‌ల‌క‌రించ‌నున్నారు. ఇప్ప‌టికే లై పాట‌లకు మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తోంది.  అలాగే ట్రైల‌ర్స్‌లో రీరికార్డింగ్‌కి స్పంద‌న బాగుంది. సినిమా రేపు విడుద‌ల కానుంది. మ‌రి లై మ‌ణిశ‌ర్మ‌కు మ‌రో స‌క్సెస్‌ను అందివ్వాల‌ని కోరుకుందాం.