మ‌రోసారి నిర్మాత‌గా నాని

Published On: August 29, 2017   |   Posted By:

మ‌రోసారి నిర్మాత‌గా నాని

హీరోగా ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం నుండి రీసెంట్‌గా విడుద‌లైన నిన్ను కోరి వ‌ర‌కు వ‌రుస విజ‌యాల‌ను సాధిస్తున్న నేచుర‌ల్ స్టార్ నాని డీ ఫ‌ర్ దోపిడీ చిత్రంతో నిర్మాత‌గా కూడా మారిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా త‌ర్వాత నాని మ‌రే సినిమాను నిర్మించ‌లేదు.

ఫిలింన‌గ‌ర్ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌క‌రాం డి ఫ‌ర్ దోపిడి త‌ర్వాత నాని మ‌రో సినిమాకు నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నాడ‌ట‌. ప్ర‌శాంత్ శ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో చేప ప్ర‌ధాన పాత్ర‌లో ఓ సినిమా రూపొంద‌నుంది.  ఈ సినిమాకు నాని నిర్మాత కానున్నాడ‌ట‌.

అప్ప‌ట్లో ఈగ సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతి ప్రపంచానికి తెలిసింది. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఈగ ఎన్నో అంత‌ర్జాతీయ అవార్డుల‌ను కూడా గెలుచుకుంది. ఈగ సినిమాలో నానియే హీరో. ఈగ పాత్ర‌ధారి. మ‌రి ప్ర‌శాంత్ శ‌ర్మ సినిమాకు నాని నిర్మాత‌. మ‌రి ఇందులో న‌టీన‌టులెవ్వ‌ర‌నేది ఇంకా తెలియ‌డం లేదు. త్వ‌ర‌లోనే ఆ వివ‌రాలు వెల్ల‌డ‌య్యే అవ‌కాశాలు క‌న‌ప‌డుతున్నాయి.