మ‌రోసారి శ‌ర్వానంద్‌తో సాయిప‌ల్ల‌వి

Published On: April 16, 2018   |   Posted By:
మ‌రోసారి శ‌ర్వానంద్‌తో సాయిప‌ల్ల‌వి
యువ కథానాయకుడు శర్వానంద్, సాయిప‌ల్ల‌వి జంట‌గా నటిస్తోన్న చిత్రం `ప‌డి ప‌డి లేచె మ‌న‌సు`. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాకోల్‌క‌తాలో తొలి షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. పాల్‌లోని కాట్మండులో రెండో షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటోంది. ప్ర‌సాద్ చుక్క‌ప‌ల్లి, సుదాక‌ర్ చెరుకూరి నిర్మిస్తోన్న ఈ సినిమాను హ‌ను రాఘ‌వ‌పూడి డైరెక్ట్ చేస్తున్నారు. త‌దుప‌రిగా శ‌ర్వానంద్ వేణు ఊడుగుల ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయనున్నాడ‌ట‌. `నీదీ నాదీ ఒకే క‌థ` తర్వాత వేణు ఊడుగుల ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌బోయే చిత్ర‌మిది. ఈ సినిమా 90వ దశకంలో సాగిన నక్సల్స్ తిరుగుబాటు నేపథ్యంలో తెర‌కెక్క‌బోతోంద‌ని సమాచారం. ఈ సినిమాకి సంబంధించి మరిన్ని విషయాలు త్వరలో వెల్లడికానున్నాయి.