మ‌రో కొత్త హీరోయిన్‌తో పూరి

Published On: September 25, 2017   |   Posted By:

మ‌రో కొత్త హీరోయిన్‌తో పూరి

టాలీవుడ్‌లో ఇప్ప‌టి ద‌ర్శ‌కుల్లో ఎక్కువ మంది హీరోయిన్స్‌ను ప‌రిచ‌యం చేసిన వారిలో పూరి ఒక‌డు. త‌న గ‌త చిత్రం పైసా వ‌సూల్‌లో కూడా ముస్కాన్ అనే హీరోయిన్‌ను పరిచ‌యం చేశాడు. ఇప్పుడు పూరి త‌న త‌న‌యుడు ఆకాష్ పూరిని హీరోగా ప‌రిచ‌యం చేయ‌డానికి రంగం సిద్ధం చేస్తున్నాడు. ప‌లు చిత్రాల్లో బాల‌న‌టుడిగా న‌టించిన ఆకాష్ ఆంధ్రాపోరి చిత్రంలో హీరోగా న‌టించిన అది పూర్తిస్థాయిలో మాత్రం లేదు. ఇప్పుడు పూరి ఆ బాధ్య‌త‌ను త‌న భుజాల‌కెత్తుకున్నాడు.

రెండు దేశాల‌కు చెందిన ప్రేమికుల స‌బ్జెక్ట్‌తో పూరి ఓ క‌థ‌ను సిద్ధం చేశాడు. ఈ సినిమా కోసం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. ముంగారు మేల్‌2 అనే క‌న్న‌డ సినిమాలో న‌టించిన నేహాశెట్టిని తెలుగులో ప‌రిచ‌యం చేయ‌బోతున్నాడ‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. త్వ‌ర‌లోనే సినిమా సెట్స్‌పైకి వెళ్ల‌నుంది.